తిరుమలలో ఆ దర్శనాలు రద్దు

0

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే లక్ష్యంతో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచీ తిరుమలలో చోటు చేసుకొన్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రేక్‌ దర్శనాల్లో అమలు చేస్తున్న ఎల్‌-1, 2, 3 విధానంలో లోపాలను ఆసరా చేసుకొని పలు అక్రమాలకు పాల్పడ్డారని ఛైర్మన్‌ తెలిపారు.

వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడం ద్వారా సామాన్య భక్తుల దర్శనం సమయం మరింత పెంచుతామని అన్నారు. ఇవాళ్టి నుంచే వాటిని రద్దు చేస్తున్నామని తెలిపారు. సాంకేతిక పరమైన అంశాలను సరిచేసి మరో రెండు మూడు రోజుల్లో అధికారులు అమలు చేస్తారని ప్రకటించారు.
Please Read Disclaimer