లలిత జ్యువెల్లరీ దోపిడీ.. దొంగలు ఇలా దొరికారు

0

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో గల లలిత జ్యువెల్లరీ షోరూంలో బుధవారం భారీ దోపిడీ జరిగి ఏకంగా 13 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు దొంగలు సినీ ఫక్కీలో దోచుకెళ్లిన సంగతి తెలిసిందే.. లలిత జ్యువెల్లరీ షాపు వెనుక భాగంలో గోడకు కన్న వేసిన దొంగలు.. తెలివిగా ముఖాలకు జోకర్ మాస్క్ లు ధరించి 13 కోట్ల ఆభరణాలను రెండు గంటల్లో తాపీగా దోచుకెళ్లారు. డాగ్ స్క్వాడ్ కు దొరకకుండా దొంగతనం చేసిన ప్లేసులో కారంపొడి చల్లారు. ఫోరెన్సిక్ కు దొరక్కుండా చేతిక గ్లౌజులు ధరించి అత్యంత చాకచక్యంగా ఈ దొంగతనం చేశారు.

దొంగల కోసం వేట మొదలుపెట్టిన పోలీసులకు పుదుకొట్టైలోని ఓ లాడ్జీలో దొంగలు ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులు వస్తున్నట్టు చూడగానే దొంగలు లాడ్జిపై నుంచి కిందకు దూకేయడం గమనార్హం. పోలీసులు వెంబడించి వారిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు సమాచారం.

నిందితులు కేరళ మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. గతంలో వీరు దొంగల ముఠాగా ఏర్పడి దుప్పట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు. దుప్పట్లో పేరుతో ఇంటిని చూసి దొంగతనం చేసే ముఠాగా పోలీసుల విచారణ లో తేలింది.
Please Read Disclaimer