తెలంగాణ లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఒక్కరోజే రూ.185 కోట్ల మద్యం అమ్మకాలు !

0

తెలంగాణ లో మహమ్మారి రోజు రోజు విపరీతం గా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులకు వైద్యులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక ఈ నేపథ్యం లో తెలంగాణ లో మరో సారి లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండు వారాల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.దీంతో ఏ క్షణమైనా లాక్ డౌన్ ప్రకటించొచ్చని భావించిన మద్యం ప్రియులు పెద్ద మొత్తంలో ముందు గానే మద్యం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లోని 2216 మద్యం దుకాణాల ద్వారా.. 29 రోజులకు ఏకంగా రూ.2226 కోట్లు విలువైన 26.29 లక్షల కేసుల లిక్కర్ 27.30 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయింది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 70 నుంచి 80 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోతుండగా సోమవారం ఒక్కరోజే మాత్రం ఏకంగా రూ.185 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయింది.ఇక మిగిలిన జిల్లాల్లో జరిగిన విక్రయాలు పరిశీలిస్తే.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.42 కోట్లు హైదరాబాద్ లో రూ.21 కోట్లు నల్గొండలో రూ.18.45 కోట్లు కరీంగనగర్ లో రూ.16 కోట్లు వరంగల్ లో రూ.15.44 కోట్లు ఖమ్మం మహబూబ్ నగర్ లలో రూ. 12 కోట్లకు పైగానే అమ్మకాలు జరిగాయి.
Please Read Disclaimer