లాక్ డౌన్ పొడిగిస్తూ కేసీఆర్ సర్కారు జీవో విడుదలలాక్ డౌన్ పొడిగిస్తూ కేసీఆర్ సర్కారు జీవో విడుదల

0

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద చర్చ నడుస్తోంది. హైదరాబాద్ మహా నగరంలో భారీ ఎత్తున పాజిటివ్ కేసులు రోజూ వందల సంఖ్యలో వస్తున్న వేళ.. పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. కేసుల పెరుగుదలకు చెక్ చెప్పేందుకు వీలుగా సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారని.. హైదరాబాద్ మొత్తాన్ని షట్ డౌన్ చేస్తారన్న ప్రచారం పెరుగుతోంది.

ఇలాంటివేళలో తెలంగాణ రాష్ట్ర సర్కారు తాజాగా ఒక జీవోను జారీ చేసింది. ఇందులో కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను పొడిగిస్తూ జీవో జారీ చేశారు. కేంద్ర హోం శాఖ రూల్స్ ప్రకారం.. కంటైంన్ మెంట్ జోన్ల లో జులై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంతకం చేశారు.డిజాస్టర్ మేనేజ్ మెంట్యాక్ట్ 2005 ప్రకారం ఈ జీవోను జారీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

అయితే.. ఈ జీవోలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అని పేర్కొన్నారు తప్పించి.. మిగిలినవేమీ ఉండవని స్పష్టం చేయటం గమనార్హం. ఆ సమయాల్లో మాత్రం అత్యవసరం అయితే తప్పించి బయటకు రాకూడదని స్పష్టం చేశారు. మందులు షాపులు తప్పించి మిగిలినవేమీ రాత్రి తొమ్మిదిన్నర తర్వాత తెరిచి ఉంచ కూడదు. జీవో వచ్చే వరకూ కూడా.. గ్రేటర్ పరిధి లో పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారని.. కేవలం రెండు.. మూడు గంటలు మాత్రమే నిత్యవసర వస్తువుల్ని కొనుక్కునేందుకు అనుమతులు ఇస్తారన్న ప్రచారం సాగింది. అందుకు భిన్నంగా సంపూర్ణ లాక్ డౌన్ కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకుండా.. గడిచిన కొంత కాలంగా జారీ చేస్తున్న రోటీన్ జీవోను జారీ చేశారు. మరి.. సంపూర్ణ లాక్ డౌన్ కు సంబంధించిన నిర్ణయాన్ని మంత్రి వర్గ సమావేశం ఫైనల్ చేస్తారా? అన్నదిప్పుడు సస్పెన్స్ గా మారింది.
Please Read Disclaimer