ఆంటీతో రాసలీలలు సాగిస్తూ దొరికిన భర్త.. చితక్కొట్టిన భార్య

0

వయసులో తన కంటే పెద్దదైన మహిళతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్య కళ్లుగప్పి ఆమెతో రాసలీలలు కొనసాగిస్తున్నాడు. భర్త చేష్టలకు విసిగిపోయిన భార్య.. పక్కా ప్రణాళికతో వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదింది. కరీంనగర్ పట్టణంలోని పద్మానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతి అనే మహిళను కరీంనగర్‌కు చెందిన అంజి అనే వ్యక్తికి ఇచ్చి తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిపించారు. వివాహమైన కొద్ది రోజులకే అంజి తన భార్యను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు.

పరాయి స్త్రీ మోజులో పడిన అంజి భార్యతో తరచూ గొడవపడటం ప్రారంభించాడు. దీంతో వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భర్త ప్రవర్తనపై స్వాతి కారణాలను ఆరా తీయగా.. అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు, పెద్దలు పలుమార్లు అంజికి అతడి ప్రవర్తన మార్చుకోవాలని నచ్చజెప్పారు. కౌన్సెలింగ్ తర్వాత తన భార్యతోనే కలిసి ఉంటానని చెప్పిన అంజి.. సదరు మహిళతో గుట్టుగా వివాహేతరం సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్వాతి.. తన భర్త కదలికలపై నిఘా పెట్టింది. ఆదివారం (జనవరి 5) అర్ధరాత్రి బంధువులతో కలిసి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

అంజితో పాటు సదరు మహిళనూ స్వాతి బంధువులు చితకబాదారు. తన కంటే చిన్నవాడైన యువకుడితో పాడు పనులేంటని ఆ మహిళను దుర్భాషలాడారు. భారీగా కట్నకానుకలు సమర్పించి తమ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తే.. మరో మహిళతో సంబంధం పెట్టుకొని ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ స్వాతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Please Read Disclaimer