కాకితో కాసులు.. ఐడియా సూపర్ గురూ..!

0

కాకి.. శని వాహనం.. అదో అపశకునంలా అందరూ భావిస్తారు. కానీ కాకితో చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. అదే కర్మఖండా.. ఎవరైనా చనిపోతే 3వ రోజు 11వ రోజు చనిపోయిన వారి ఆత్మ కాకిరూపంలో వచ్చి తినుబండారాలు తింటేనే ఆ కుటుంబ సభ్యులంతా తిని విందు ఏర్పాటు చేస్తారు. తినేవారకు అక్కడి నుంచి కదలరు. ఈ కష్టం చనిపోయిన కుటుంబాల వారందరూ ఎప్పుడో ఒకప్పుడు చవి చూసి ఉంటారు.

అయితే యథాలాపంగా జరిగిన ఓ ఘటన ఒక యువకుడిలో కొత్త ఆలోచనకు దారి తీసింది. అదే ఇప్పుడు అతడికి ఆదాయ మార్గంలా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాకు చెందిన యువకుడు ప్రశాంత్ పూజారి కాకితో ఆదాయాన్ని సమపార్జిస్తున్నాడు. కొద్దిరోజుల కిందట ఈ యువకుడి ఇంటి ముందున్న చెట్టు గూడు నుంచి మూడు కాకిపిల్లలు కింద పడిపోయాయి. వాటిని చూసిన యువకుడు ప్రశాంత్ పూజారి బుట్టలో వేసి పెంచసాగాడు. అందులో రెండు చనిపోగా ఒక కాకి మాత్రం బతికింది. దానికి రాజా అని పేరు పెట్టి మంచిగా పెంచుతున్నాడు.

అయితే కొద్దిరోజులకు యువకుడి సమీపంలోని కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోయాడు. కర్మఖాండలకు కాకి ముట్టుకోక వారు బాధపడసాగారు. ప్రశాంత్ పూజారి వద్ద కాకి ఉందని తెలుసుకొని ఫోన్ చేసి రప్పించి ఆ కాకితో వంటకాలను తినిపించి శాంతి చేశారు. అలా మొదలైన ప్రశాంత్ పూజారి ఆలోచన అనంతరం ఫేస్ బుక్ వాట్సాప్ లో ప్రకటనల దాకా వెళ్లింది.

ఉడుపి చుట్టుపక్కల కాకుల జనాభా చాలా తక్కువ. కర్మఖండాల్లో అస్సలు కాకులే రాకుండా ముట్టకుండా మృతుల కుటుంబీకులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రశాంత్ పూజారి ఫేస్ బుక్ లో ఇచ్చిన ప్రకటనతో అతడికి సకల సౌకర్యాలతో కారులో తీసుకొస్తూ రూ.500 నుంచి 2000 వరకు ఇస్తూ కాకితో కర్మఖండాల వంటకాలు తినిపిస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రశాంత్ కు అందివచ్చిన వ్యాపారంగా మారింది. కాకితో కాసులు సంపదిస్తున్న ప్రశాంత్ స్టోరీ అందరికీ నమ్మశక్యంగా మారింది.
Please Read Disclaimer