చెరువులో పడి యజమాని మృతి.. తిరిగొస్తాడని కుక్క పడిగాపులు!

0

కుక్కలు తమ యజమానులపై ఎంత విశ్వాసంగా ఉంటాయో థాయ్‌లాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఓ ఘటనే నిదర్శనం. చాంతాబురికి చెందిన సోంపార్న్‌ సితాంగ్‌కమ్‌ (56) అనే రైతు ఎప్పటిలాగానే పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా చెరువు గట్టున ఉన్న స్పింక్లర్‌ వాల్వ్‌ ఆన్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయాడు.

అతడి పెంపుడు కుక్క మిహి ప్రమాదాన్ని పసిగట్టి అక్కడకు చేరుకుంది. అయితే, అప్పటికే సోంపార్న్ చనిపోయాడు. ఆ విషయం తెలియక ఆ కుక్క అతడు బయటకు వస్తాడని ఎదురుచూస్తూనే ఉంది. అదే సమయంలో సోంపార్న్ సోదరి అక్కడకు వచ్చింది. చెరువు వద్ద తన సోదరుడి చెప్పులు, టార్చ్‌లైట్ చూసి ఆందోళనకు గురైంది. మిహి చెరువు వైపు చూస్తుండటంతో ప్రమాదాన్ని పసిగట్టి రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేసింది. చెరువులో మునిగిన సోంపార్న్ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో:
Please Read Disclaimer