ఐసీయూలో పెళ్లి.. ప్రియురాలికి తాళి కట్టి పరారైన ప్రియుడు, రేప్ కేసు నమోదు!

0

ఆమెను ప్రేమిస్తున్నా అని వెంటపడ్డాడు. తాను లేకుండా బతకలేనంటూ బతిమాలాడు. ఆ తర్వాత ఆమెతో బలవంతంగా శరీరక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకుందామంటే.. నువ్వు తక్కువ కులం దానివంటూ అవమానించాడు. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆస్పత్రిపాలు కావడంతో.. ఐసీయూలోనే ఆమెకు తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని గంటల తర్వాత ఎవరికీ కనిపించకుండా పారిపోయాడు.

ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. సూరజ్ అనే యువకుడు బాధితురాలిని ప్రేమించాడు. శరీరక సంబంధం వల్ల ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకుందామని బాధితురాలు చెప్పింది. ఇందుకు సూరజ్ అంగీకరించలేదు. తక్కువ కులం అమ్మాయిలను పెళ్లి చేసుకోడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరాని చెప్పాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది.

ఈ విషయం తెలియగానే బాధితురాలి బంధువులు అతడిని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఐసీయూలో ఉన్న బాధితురాలికి తాళి కట్టించారు. అయితే, అప్పటికీ అతడిలో మార్పు రాలేదు. ఆమె బంధువుల కళ్లు గప్పి హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతడిపై ఐపీసీ సెక్షన్ 376 కింది అత్యాచారం, ఎస్సీ-ఎస్టీ చట్టం వేధింపుల నివారణ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Please Read Disclaimer