రోడ్డు విస్తరణ లో ఇల్లు పోకుండా అతడేం చేస్తున్నాడో చూడండి!

0

టెక్నాలజీని ఉపయోగించుకోవాలే కాని ఎన్నో అద్బుతాలను సృష్టించవచ్చని ఎంతో మంది నిరూపించారు. గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా భవనాలు మరియు చెట్లు వందలు వేల సంఖ్యల్లో తొలగించాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అయితే తొలగించిన చెట్లను మరో ప్రాంతంలో నాటడం చేస్తున్నారు. ఇక ఇళ్లను కూడా కొందరు సాధ్యం అయినంత వరకు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేట ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణలో ఈమద్యే కట్టుకున్న పోతుల రామ్ కుమార్ ఇల్లు కూల్చి వేయాల్సి ఉంటుందని నోటీసులు అందాయి.

ఎంతో ఇష్టపడి.. కష్టపడి కట్టుకున్న ఇల్లును సగం వరకు కూల్చి వేస్తామంటూ నోటీసులు రావడంతో రామ్ కుమార్ తీవ్ర మనస్థాపంకు చెందాడు. మళ్లీ నిర్మించుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అది కూడా మళ్లీ పెద్ద ప్రాసెస్. అందుకే ఇంటిని కూల్చి వేయకుండా ప్రత్యామ్నాయం వెదికాడు. ఇంటర్నెట్ లో ఇంటిని జరిపే విధానం ఉందని తెలుసుకున్నాడు. ఆ పనిని ఏజె బిల్డింగ్స్ లిఫ్టింగ్ వారికి అప్పగించాడు. 16 లక్షల రూపాయల ఒప్పందంతో పని మొదలు అయ్యింది. 20 రోజుల క్రితం పనులు మొదలు అవ్వగా మొదటి 15 రోజులు జాకీలు ఏర్పాటు చేయడం ఇంటిని వెనక్కు జరిపేందుకు కాంక్రీట్ పిల్లర్ల నిర్మాణం జరిగింది.

తాజాగా ఇల్లు వెనక్కు మూవ్ చేయడం ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు నాలుగు అడుగుల వరకు వెనక్కు జరపడం జరిగిందట. మరో నెల రోజుల్లో 33 అడుగులు జరపనున్నట్లుగా రామ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇల్లు వెనక్కు జరిపే కార్యక్రమం జరుగుతున్నా కూడా అదే ఇంట్లోని పై అంతస్తులో రామ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాలేదని అతడు అంటున్నాడు.

భవనంను మూవ్ చేసే సమయంలో గోడలు డ్యామేజీ కాకుండా సిమెంట్ ఇటుకలతో తాత్కాలికంగా సపోర్టింగ్ గోడను నిర్మించడం జరిగింది. ఇల్లు పూర్తిగా వెనక్కు జరిపిన తర్వాత పిల్లర్ల నిర్మాణం ఇతరత్ర కాంక్రీట్ పనులకు 17 లక్షల రూపాయలు ఖర్చు కానుందట. మొత్తంగా 34 లక్షల రూపాయలో తన ఇంటిని 37 అడుగుల వెనక్కు జరుపబోతున్నాడు. ఇప్పటికే సగం పని పూర్తి అయ్యిందని మిగిలిన పనులు నెలన్నరలో పూర్తి అవుతాయని ఇంటికి ఏం కాకుండా జాగ్రత్తగా ఏజె బిల్డింగ్స్ లిఫ్టింగ్ కంపెనీ వారు జరుపుతున్నారని రామ్ కుమార్ అంటున్నాడు.
Please Read Disclaimer