హవాయిలో విహరిస్తున్నట్లు ఫేక్ వీడియో.. యువకుడి క్రియేటివిటీకి నెటిజనులు ఫిదా

0

హవాయిలో హాలీడేస్ ఎంజాయ్ చేయాలనేది ఆ యువకుడి కల. అయితే, అంత దూరం వెళ్లేందుకు చాలా ఖర్చవుతుందనే ఉద్దేశంతో వెనుకడుగు వేశాడు. అయితే, తన కలను మాత్రం చంపుకోలేదు. అక్కడికి నిజంగా వెళ్లలేకపోకపోయినా.. ఊహల్లో విహరించాలని అనుకున్నాడు. కత్తిలాంటి ఐడియాతో అనుకున్నది సాధించాడు. విమానం ఎక్కినట్లు.. హవాయి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియోను సృష్టించాడు.

@aanthonyy07 అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. కేవలం హవాయి పర్యాటకుడిగానే కాకుండా విమానంలో ఎయిర్ హోస్టెస్‌గా కూడా కనిపించిన ఆ యువకుడి వేషాలు చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. సముద్ర అలలకు కిందపడిపోతున్నట్లు, అగ్నిపర్వతం లావాలో వేలు పెట్టినట్లు ఇంకా చాలానే చేశాడు. అవన్నీ ఇక్కడ చదవడం కంటే చూస్తేనే బాగుంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ వీడియోను చూసేయండి.

వీడియో:
Please Read Disclaimer