హైపవర్ కమిటీతో సోషల్ మీడియా ప్రక్షాళన

0

ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్. అయితే ఇందులో ఫేక్ న్యూస్ కు కొదవేలేదు. ఎవ్వరైనా ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. దీనికి అడ్డుకట్ట లేకపోయేసరికి అనర్థాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వివాదాస్పద పోస్టులకు చెక్ పెడుతూ కంటెంట్ ఆధునీకరణ కోసం ‘హైవర్ కమిటీని’ని ఏర్పాటు చేశారు. ఫేస్ బుక్ సుప్రీం కోర్టుగా చెబుతున్న ఈ పర్యవేక్షక బోర్డుతో సోషల్ మీడియా ప్రక్షాళన సాధ్యమా అనే చర్చ మొదలైంది.

ఈ హైవర్ కమిటీలో 27దేశాలకు చెందిన 20 మంది సభ్యులున్నారు. డెన్మార్క్ మాజీ ప్రధాని హీలీ స్మిత్ నోబెల్ గ్రహీత కర్మన్ బెంగళూరు లా వర్సిటీ వీసీ సుధీర్ కృష్ణ స్వామి వంటి ప్రముఖులు ఈ బోర్డులో ఉన్నారు. వీరంతా ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ వాట్సాప్ వేదికల్లో కంటెంట్ ను అనుమతించడంపై మార్క్ జుకర్ బర్గ్ నిర్ణయాలను సైతం తిరగతోడే అధికారం ఈ బోర్డుకు కల్పించారు.

ఫేస్ బుక్ చేతిలోనే ఇన్ స్టాగ్రామ్ వాట్సాప్ సంస్థలున్నాయి. దీంతో ఈ బోర్డు సభ్యులు 300 కోట్ల వినియోగదారుల డేటా బేస్ ను ఎలా పర్యవేక్షిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది చాలా రిస్క్ తో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ఫిర్యాదుల పరిష్కారం కంటెంట్ పై అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోవడం పూర్తికాలం పనిచేసినా సాధ్యం కాదంటున్నారు.

130 మిలియన్ డాలర్లతో ఫేస్ బుక్ ఏర్పాటు చేసిన ఈ బోర్డు సమస్యాత్మక కంటెంట్ ను ముందుగానే గుర్తించి నిరోధించాలి. అయితే తీవ్రమైన పోస్టులపై చర్యలు తీసుకునే అధికార ఫేస్ బుక్ కు లేదు. దీంతో బోర్డు ఏం చేసినా సురక్షిత వేదికలుగా ఫేస్ బుక్ సంస్థలు ఉంటాయని ఆశించలేం.

అయితే చాలా కేసులు అవుతున్నా దృష్ట్యానే నిపుణులపై నెపం వేసి తీవ్రమైన కంటెంట్ పై తమకు ఏపాత్ర లేదని ఫేస్ బుక్ తప్పించుకునేందుకే ఇలా కమిటీ వేసిందన్న ప్రచారం సాగుతోంది.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home