నిజమేనా సార్..డైరెక్టర్ మారుతి

0

తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను.. ప్రముఖ దర్శకుడు మారుతి ట్విటర్‌లో ఓ ప్రశ్న అడిగారు. ‘హైదరాబాద్‌కు 48 రోజులకు సరిపోయే మంచి నీరు మాత్రమే మిగిలి ఉంది’ అని ఓ ఆంగ్ల పత్రికలో వార్త ప్రచురితమైంది. అది మారుతి దృష్టికి రావడంతో దానిని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు.

‘సర్‌ ఇది నిజమేనా’ అని ప్రశ్నించారు. ఇందుకు కేటీఆర్‌ సమాధానమిస్తూ.. ‘ఆ వార్త కరెక్ట్‌ కాదు. మరికొన్ని వారాల్లో కాళేశ్వరం నీరు ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి వస్తుంది. దీని ద్వారా హైదరాబాద్‌కు రోజుకు 172 మిలియన్‌ గ్యాలన్ల నీరు అందుతూనే ఉంటుంది. ఇందులో ఏ మార్పూ లేదు. చెన్నైలా హైదరాబాద్‌కు ఎప్పుడూ నీటి సమస్య ఏర్పడదు’ అని సమాధానమిచ్చారు. 

ఇందుకు మారుతి ప్రతి స్పందిస్తూ.. ‘శుభవార్త చెప్పినందుకు ధన్యవాదాలు సర్‌. నీటి ఎద్దడి సమస్యను సీరియస్‌గా తీసుకుని నీటిని సంరక్షించుకునే సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.
Please Read Disclaimer