రేప్ వీడియో వైరల్.. ఆ బాధితురాలు ఏం చేసిందంటే?

0

రోజ్ కాలెంబా.. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణంలో పెరిగింది. 2009 వేసవి కాలంలో పిల్ల గాలి కోసం తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే ఆమె పాలిట శాపమైంది. అప్పుడు రోజ్ కాలెంబా వయసు 14 ఏళ్లు.

రోజ్ కాలెంబా రోడ్డుపై నడుస్తుండగా చీకట్లో వచ్చిన ఒక వ్యక్తి ఆమె మెడకు కత్తి పెట్టి బలవంతంగా తన కారులోకి ఎక్కించాడు. ఆ కారులోనే మరో 19 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి కార్లో పట్టణానికి దూరంగా ఉన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు. దాదాపు 12 గంటల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మూడో వ్యక్తి దాన్ని వీడియో తీశాడు.

రేప్ సమయంలో ఆమెను చాలా తీవ్రంగా కొట్టారు. ఎడమకాలిపై కత్తితో పొడిచారు. బట్టలన్నీ రక్తంతో తడిచిపోయినా సృహ తప్పినా ఆమెను వదలకుండా రేప్ చేశారు ఆ కామ పిశాచులు.

ఆ రేప్ సమయంలోనే వేరే మహిళను ఎలా రేప్ చేశారో చూసుకుంటూ మరీ రోజ్ పై ఈ దారుణానికి ఒడిగట్టారు. రేప్ చేశాక చంపేస్తామని రోజ్ ను బెదిరించారు. కానీ ఆమె మాత్రం మీ పేర్లు ఎవరికీ చెప్పనని.. పోలీసులకు వివరించనని తనను చంపద్దని బతిమిలాడింది. దీంతో ఆ ముగ్గురూ ఆమెను అదే కార్లో తీసుకెళ్లి ఆమె ఇంటి దగ్గర రోడ్డుపై వదిలేశారు.

ఇంటికి వచ్చిన రోజ్ ను చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పోలీసులకు కంప్లైట్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో డాక్టర్ పోలీస్ కూడా ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఇష్టంతోనే చేశావా అని అడిగేశారట.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక రోజ్ ఆత్మహత్యాయత్నం చేసింది. సోదరుడు కాపాడడంతో బతికిపోయింది.

తనను రేప్ చేసిన దుర్మార్గులు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రోజ్ స్కూల్లోని చాలామంది ఆ లింక్ షేర్ చేయడంతో రోజ్ చూసి తీవ్ర మనస్తాపంలో కూరుకుపోయింది. ప్రసిద్ధ పోర్న్ సైట్ పోర్న్ హబ్ లోనూ పెట్టడంతో వీడియో ప్రపంచమంతా వైరల్ అయ్యింది.

2009 నుంచి ఈ రేప్ జరిగిన నాటి నుంచి పోర్న్ హబ్ వెబ్ సైట్లకు రోజ్ ఎన్నో మెయిల్స్ చేసింది. నేను మైనర్ ను అని ఆ రేప్ వీడియోలు తొలగించాలని కోరినా వారు తొలగించలేదు.. ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో బయటకు రాకుండా ఏడాది పాటు రోజ్ ఒంటరిగా నిశ్శబ్ధంగా ఉండిపోయింది.

తర్వాత రోజ్ కు ఒక ఐడియా వచ్చింది. ఒక కొత్త ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసింది. తనను ఒక లాయర్ గా చెబుతూ.. వీడియోలు తొలగించకపోతే చట్టపరమైన యాక్షన్ తీసుకుంటానంటూ పోర్న్ హబ్ కు ఈమెయిల్ చేసింది. దీంతో 48 గంటల్లో ఆ వీడియోలను తొలగించారు.
Please Read Disclaimer