రస్నా ఫౌడర్‌ను డ్రగ్స్‌గా అమ్మేస్తున్న కేటుగాళ్లు.. బానిసలకు ఝలక్!

0

డ్రగ్స్ తీసుకోవడం చట్టరీత్యా నేరమనే సంగతి తెలిసిందే. అయితే, ఆ డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు.. కస్టమర్లకు అసలైన మాదక ద్రవ్యాలు కాకుండా నకిలీవి ఇస్తే? ఎవరైనా మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ, డ్రగ్స్ తీసుకునేవాళ్లు ఎవరిని ఆశ్రయించాలనేదే చిక్కు ప్రశ్న. ఇదే సందేహం మేఘాలయ పోలీసులకు కూడా వచ్చింది.

ఇటీవల పోలీసులు క్రియేటివ్ ట్వీ్ట్లతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మేఘాలయా పోలీసులు కూడా ఓ ట్వీట్‌తో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యారు. డ్రగ్స్ విక్రేతలు మాదక ద్రవ్యాలకు బదులు రస్నా ఫ్రూట్ డ్రింక్‌కు ఉపయోగించే ఫౌడర్‌ను ప్యాకెట్లలో పెట్టి అమ్మేస్తున్నారు. ఈ విషయాన్ని మేఘాలయ పోలీసులు సరికొత్తగా వివరించారు.

‘‘స్కాం అలర్ట్! షిల్లాంగ్ మార్కెట్‌లో డ్రగ్స్ కొరత ఏర్పడటంతో డ్రగ్స్ విక్రేతలు రస్నా ఫౌడర్‌లను మాదక ద్రవ్యాలు కింద అమ్మేస్తున్నారు. మీకెవరికైనా ఆ రస్నా ఫౌడర్లు లభిస్తే.. మాకు ఫిర్యాదు చేయండి. కుడోస్.. యాంటీ నార్కొటిక్ టాస్క్ ఫోర్స్(ANTF) టీమ్’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ డ్రగ్ బానిసలను గందరగోళంలో పడేసింది. ఇప్పుడు డ్రగ్స్ స్థానంలో రస్నా ప్యాకెట్లు దొరికితే మన పరిస్థితి ఏమిటీ? అని వాపోతున్నారు.

ఇదిగో రస్నా.. స్మగ్లర్ల వద్ద స్టాక్ లేకపోతే ఇవ్వండి

డబ్బులు తెచ్చావా?
Please Read Disclaimer