బాయ్‌ఫ్రెండ్‌తో బెడ్రూమ్‌లో కూతురు.. తల్లి సడెన్ ఎంట్రీతో

0

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగిస్తున్న బాలిక తల్లి సడెన్ ఎంట్రీతో షాక్‌కు గురై ఆత్మహత్యకు యత్నించిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ముంబయిలోని కుర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలిక(17) స్థానికంగా ఓ యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది.

ఇటీవల ఆమె కుటుంబసభ్యులందరూ బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో ప్రియుడికి కబురు పెట్టింది. ఇద్దరూ బెడ్రూమ్‌లో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె తల్లి సడెన్‌గా లోనికి వచ్చింది. దీంతో తల్లికి తన బండారం బయటపడుతుందేమోనని ఆందోళన పడిన బాలిక బెడ్రూమ్‌ కిటికీలో నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

తన కూతురు కిందికి దూకేసిందని తెలుసుకున్న తల్లి ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలిక ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న కారణంగా అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-