వైసీపీలో ద్రోహులకు స్ట్రాంగ్ వార్నింగ్

0

రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచింది. ఆ జిల్లాలోనూ వీచింది. కానీ అక్కడి వైసీపీ అభ్యర్థి గెలవలేదు.. వివాదాలతో వార్తల్లో నిలిచిన నందమూరి బాలయ్యే తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. హిందుపురంలో ఖచ్చితంగా ఓడిపోతాడని అందరూ భావించిన నటుడు – ఎమ్మెల్యే బాలక్రిష్ణ గెలవడం వెనుక వైసీపీ పార్టీలోని కొందరు చేసిన నమ్మక ద్రోహమేనని అధిష్టానం అనుమానించింది.

తాజాగా బాలయ్య చేతిలో ఓడిన మహ్మద్ ఇక్బాల్ కూడా అదే మాట అన్నారు. హిందుపురంలో కార్యకర్తలు – నాయకులతో సమావేశమైన ఎమ్మెల్సీ ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన వారు తరువాత పార్టీకి విధేయులమంటూ ఎలా చెప్పుకుంటారని ఎమ్మెల్సీ ఇక్బాల్ ఫైర్ అయ్యారు.

వైసీపీలో నాయకత్వానికి మించిన నాయకుడు లేడని.. అధిష్టానమే అందరికీ పెద్ద అన్నారు. పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళుతూ నాయకులు – కార్యకర్తలు కలిసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని ఇక్బాల్ పిలుపునిచ్చాడు..

గత ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచి వైసీపీకి ద్రోహం చేసిన వారు ఇప్పుడు వైసీపీ గెలిచాక తన పేరు – పార్టీ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నారని.. తన దృష్టికి తీసుకెళ్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఇక్బాల్ సంచలన హెచ్చరికలు చేశారు.ఇలా తన ఓటమికి కారకులైన వారిని వదిలిపెట్టబోమని ఇక్బాల్ చేసిన ప్రకటన అనంతపురం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది..
Please Read Disclaimer