మోహన్ బాబుకు ఆశాభంగమా?

0

ఒకవేళ నిజంగానే మోహన్ బాబు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించి ఉంటే.. ఆయనకు ఇది ఆశభంగమేనేమో! ఏపీ అసెంబ్లీ కోటాలో దక్కే నాలుగు రాజ్యసభ సీట్ల విషయంలో కసరత్తును సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆ విషయంలో మోహన్ బాబును పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం. మోహన్ బాబు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సారి రాజ్యసభ సభ్యుడయ్యారు. అప్పట్లో ఆ ఆరేళ్ల పదవీ కాలం తర్వాత ఎన్నో రాజకీయ పరిణామాలు మారాయి ఆ పరిణామాల్లో మోహన్ బాబుకు కొనసాగింపు లభించలేదు. ఆ తర్వాత మోహన్ బాబు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా వ్యవహరించింది లేదు.

గత ఎన్నికల ముందు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ కు మద్దతు ప్రకటించారు. అయితే మోహన్ బాబుకు ఉన్న రాజకీయ బలం ఎంత అనేది కొశ్చన్ మార్కే. అందునా వైఎస్ కుటుంబంతో ఆయనకు వియ్యం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన జగన్ పార్టీలో చేరడం మరీ వింత కాలేదు.

అయితే ఇటీవలే ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. దీంతో ఆయన బీజేపీలోకి చేరతారంటూ ఒక రూమర్ మొదలైంది. ఏపీలో బలపడాలని బీజేపీ కూడా భావిస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు ఆ పార్టీలోకి చేరతారేమో అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే గతంలో కూడా మోడీతో మోహన్ బాబుకు కొంత పరిచయం ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన ప్రధానితో సమావేశం అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

ఆ సమావేశం జగన్ ను బ్లాక్ మెయిల్ చేయడానికే అని రాజ్యసభ సీటును డిమాండ్ చేస్తూ అలా మోడీతో మోహన్ బాబు సమావేశం అయ్యాడనే టాక్ ఉంది. అయితే అలాంటి బెదిరింపులకు జగన్ భయపడకపోవచ్చు మోహన్ బాబు కూడా అలాంటి ట్రిక్స్ ప్లే చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే.. మోడీతో మోహన్ బాబుకు కొంత పరిచయం ఉంది కాబట్టి!

ఇక మోడీతో సమావేశం అనంతరం.. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు మోహన్ బాబుతో ఒక ప్రోగ్రామ్ లో సన్నిహితంగా మెలిగారు. జగన్ తో మోహన్ బాబు మళ్లీ కలిసింది లేదు కానీ వైసీపీ నేతలు మాత్రం ఆయనతో వివిధ ప్రోగ్రామ్స్ ల కనిపించారు. ఇక తను ఎలాంటి పదవినీ ఆశించలేదని మోహన్ బాబు గతంలో కూడా చెప్పారు. అయితే మోహన్ బాబు గతంలో రాజ్యసభ మెంబర్ గా వ్యవహరించి ఉండటంతో ఇప్పుడు వైసీపీకి మంచి స్థాయిలో సీట్లు దక్కుతూ ఉండటంతో.. మోహన్ బాబు పేరు కూడా ఊరికే ఊసులోకి వస్తున్నట్టుగా ఉంది. గతంటో టీటీడీ చైర్మన్ పదవి విషయంలోనూ ఆయన పేరు వచ్చింది. అప్పుడు మోహన్ బాబు ఖండించుకోవాల్సి వచ్చింది. బహుశా ఇప్పుడు కూడా అదే చేయాల్సి ఉందేమో!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-