సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

విశాఖ నుంచే పాలన.. ముహూర్తం ఖరారు చేసిన జగన్

0

అమరావతి రైతుల ఆందోళనలు ఓ వైపు కొనసాగుతూనే ఉన్నాయి. హైకోర్టులో రాజధానిపై పీటముడి నెలకొంది. అయితే వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిని సైలెంట్ గా అమరావతి నుంచి విశాఖ పట్నానికి మార్చడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ ఉగాదికి విశాఖపట్నం నుంచి జగన్ పరిపాలన ప్రారంభిస్తారని.. కొత్త తెలుగు సంవత్సరాదినే ముహూర్తంగా నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అయితే జగన్ సర్కారు మాత్రం ఇంకా ముహూర్తాన్ని ఖరారు చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ సోమవారం సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. అక్కడ విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలువబోతున్నారు. అప్పుడే ఏపీ పరిపాలన రాజధాని విశాఖ నుంచి పాలన కొనసాగించే మహూర్తాన్ని ఖరారు చేయబోతున్నట్టు తెలిసింది.

విశాఖ శారద పీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. స్వరూపానందతో భేటి అయ్యి ముహూర్తం ఖరారు చేస్తారు. విశాఖపట్నంలో సీఎం కార్యాలయం ప్రారంభోత్సవం కోసం స్వామి స్వరూప నంద ముహూర్తాన్ని ఖరారు చేస్తారు. ఉగాది పండుగ నాడే ముహూర్తం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Please Read Disclaimer