కరోనా దెబ్బ : రూ. 44వేలకోట్లు నష్టపోయిన అంబానీ !

0

స్టాక్ మార్కెట్ ను నమ్ముకుంటే బండ్లు ఓడలు అవుతాయో లేదో తెలియదు కానీ.. ఓడలు మాత్రం బండ్లు అయ్యే ప్రమాదముంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా …అయితే ఇది పూర్తిగా చదవండి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్థికమాంద్యంతో అతలాకుతలం అవుతోంది. ఈ సమయంలో కరోనా వైరస్ ప్రపంచంపై దాడి చేస్తుండటంతో ప్రపంచం కొట్టుకిట్టాడుతోంది. ముఖ్యంగా కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థ పై ఎక్కువగా ప్రభావం చూపిస్తుండటంతో పలు కీలక సంస్థల అధినేతలు కూడా షాక్ అవుతున్నారు. కరోనా దెబ్బకి ఇప్పటికే అనేక సంస్థలు మూతపడ్డాయి. ఇలా రెండు ఇలా రెండు వైపుల నుంచి దాడి జరుగుతున్న సమయంలో ఇప్పుడు మరో దెబ్బ పడింది. అదే చమురు దెబ్బ.

కరోనా వైరస్ కారణంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయిల్ మార్కెట్ నష్టాల్లో ఉంది. ఈ ప్రభావం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పైనా పడింది. దీంతో మార్చి 9వ తేదీన మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాప్ లో నిలిచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ను రెండో స్థానంలోకి నెట్టి వేసింది. ఇటీవల రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను క్రాస్ చేసిన ఇండియన్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. అయితే చమురు మార్కెట్ దెబ్బతో రిలయన్స్ M-Cap డిసెంబర్ 2019 రికార్డ్ హైతో పోల్చుకుంటే రూ.2.7 లక్షల కోట్లు ఆవిరైంది.

ఇకపోతే ప్రస్తుతం ఒపెక్ రష్యా దేశాల మధ్య చమురు యుద్ధం జరుగుతున్నది. కరోనా ప్రభావం వలన అనేక దేశాలకు రవాణ వ్యవస్థ స్థంబించిపోవడంతో చమురు ఉత్పత్తి చేసే దేశాలలో అధికశాతం నిల్వ ఉండిపోయాయి. దీంతో ఒపెక్ సంస్థ చమురు ఉత్పత్తిని ధరలను తగ్గించి ఉన్న నిల్వలను అమ్మెయ్యాలని చూస్తున్న కూడా రష్యా అడ్డుతగులుతోంది. ఈ సమయంలోనే చమురు ధరలు అమాంతం పడిపోయాయి. జనవరి 17 – 1991 గల్ఫ్ వార్ తర్వాత క్రూడాయిల్ ధరలు అత్యంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. చమురు ధరలు పడిపోవడంతో రిలయన్స్ షేర్స్ కూడా భారీగా పడిపోయాయి. గత వారమే అత్యధికశాతం సంపదను కోల్పోయిన రిలయన్స్ మరోసారి 44వేలకోట్ల రూపాయల సంపదను కోల్పోయింది.
Please Read Disclaimer