పాఠం చెప్తానని గదిలోకి పిలిపించి.. కీచక టీచర్ దుశ్చర్య

0

ఓ ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. చదువుకోవడానికి వచ్చే కూతురు వయసున్న విద్యార్థినులను అసభ్యంగా తాకుతూ దారుణంగా ప్రవర్తించేవాడు. చివరకు ఓ విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఈ విషయాన్ని బహిర్గతం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ముంబైలోని తోడ్కోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్‌లో నిందితుడు హీరానందాని ట్యూషన్స్ చెబుతున్నాడు. అయితే తన వద్దకు వచ్చే విద్యార్థినులపై అతడు అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. విద్యార్థినులు భయపడి అతడి దుశ్చర్యలను బయటకు చెప్పేవారు కాదు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి కొత్తగా కోచింగ్ సెంటర్‌లో చేరింది. దీంతో ఆమెపై కన్నేసిన ఆ ట్యూషన్ టీచర్ ఆమెను లొంగదీసుకోవాలని భావించాడు. ఆమెతో మంచిగా ఉన్నట్లు నటించాడు.

ఇటీవల పాఠాల కోసమని చెప్పి తన చాంబర్‌లోకి యువతిని పిలిచాడు. అనంతరం యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు అక్కడి నుంచి పారిపోయింది. నేరుగా ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Please Read Disclaimer