కశ్మీర్లో అత్తా మామ.. ఉర్మిళ కంగారు

0

ఉర్మిళా మటోండ్కర్.. రంగీలా పాటతో దేశవ్యాప్తంగా కుర్రకారు మదిని దోచేసిన బాలీవుడ్ హీరోయిన్. కశ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త – మోడల్ అయిన మోసిన్ అఖ్తర్ మిర్ ను పెళ్లి చేసుకొని ముంబైలో సెటిల్ అయిపోయింది. ఇటీవల ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయింది. ఉర్మిళ రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం కాంగ్రెస్ తరుఫున వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

తాజాగా కాంగ్రెస్ మాజీ సీఎం అశోక్ చవాన్ తో కలిసి నాందేడ్ లో పర్యటించిన ఉర్మిళ తన అత్తామామల గురించి వాపోయారు. ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్ లో నిషేధించాక 22 రోజులుగా తన అత్తామామలు ఎలా ఉన్నారో అర్థం కాక తన భర్త తాను కుమిలిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేసింది. రక్తపోటు – షుగర్ ఉన్న వాళ్లకు మందులు అందుబాటులో ఉన్నాయో లేవో.. వారు అసలు ఎలా ఉన్నారో తెలియడం లేదని ఉర్మిళా ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక ఆర్టికల్ 370తో కశ్మీరీలకు అభివృద్ధి జరిగితే ఏం ఫర్వాలేదని.. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేసిన విధానమే బాగోలేదని ఉర్మిళ అభిప్రాయపడ్డారు. దీని పర్యవసనాల తర్వాత మోడీ నిర్ణయంపై అభిప్రాయం వెల్లడిస్తామని ఉర్మిళ పేర్కొన్నారు.
Please Read Disclaimer