జనసేనకు నాదెండ్ల రాజీనామా…! ?

0

జనసేన పార్టీలో ముసలం పుట్టినట్లు తెలుస్తోంది. పార్టీ భారం మోయలేకనో… బీజేపీ అధిష్ఠానమిచ్చిన ఆఫరో తెలియదు గాని జనసేనను కమలం పార్టీలో విలీనం చేయాలని పవన్ భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో వెళ్లిన పవన్ అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అప్పుడే జనసేనను బీజేపీలో విలీనం చేస్తే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని అమిత్ షా ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దీంతో పవన్ బీజేపీలో పార్టీని విలీనం చేయడానికి ఆసక్తిగా ఉన్నారని… అమిత్ షా అంటే తనకెంతో ఇష్టమని – గౌరవమని వ్యాఖ్యనించడం వెనుక అసలు నిజాలు ఇవేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ఇక జనసేనలో చేరినప్పటి నుంచి పవన్‌కు వెన్నంటి ఉంటున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇప్పుడు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట. బీజేపీతో పవన్ దోస్తీ ఆయనకు ఎంతమాత్రం నచ్చడం లేదట. తనకు మాట మాత్రంగా నైనా చెప్పకుండా కీలక నిర్ణయం తీసుకోవడంపై ఆయన కినుక వహించారని జనసేన వర్గాల్లోనే చర్చలు నడుస్తున్నాయి. ప్రాంతీయ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని – అయితే జనసేన విషయంలో అది నిజం కాకపోయినా… తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్ ఉందని నమ్ముతున్నారట. పార్టీ బాధ్యతలు నిర్వహణ భారంగా మారాయని పవన్‌కు అనిపిస్తే తెలుగుదేశం తమతో కలిసి వచ్చేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆ పార్టీతో కలిసి పని చేస్తే నిలదొక్కుకుంటాం కదా ? అని మనోహర్ వాపోతున్నాడట.

వాస్తవానికి పవన్ కు నీడలా ఉన్న మనోహర్ పార్టీకి దూరమైతే ఇక పెద్దగా చెప్పుకోదగిన నాయకులెవరు ఆయన పార్టీలో లేరనే చెప్పాలి. ప్రజా సమస్యల విషయంలో ఆయనతో కలిసి పోరాటం చేశారు నాదెండ్ల మనోహర్. ఇక పార్టీ ఓడిపోయినా సరే ఆయన మాత్రం పవన్ వెంటే నడిచారు. పార్టీలో ఆయన నెంబర్ 2 అన్న నమ్మకం శ్రేణుల్లో ఏర్పడింది. పవన్‌కు రాజకీయ అనుభవం లేకపోవడంతో ఆయన్ను మనోహర్ బాగా ప్రభావం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పవన్ చేస్తున్న వ్యాఖ్యలు మనోహర్ కు చిరాకు తెప్పిస్తున్నాయట. పవన్ ఎప్పుడు ? ఏం మాట్లాడుతున్నాడో ? తెలియక ఒక్క మనోహర్ మాత్రమే కాదు.. జనసేన కీలక నాయకులు సైతం షాక్ అవుతున్నారట. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు నెలల నుంచే పోరాడకుండా విలీనం మాటలు మాట్లాడటమే వీరంతా తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారట.
Please Read Disclaimer