భారత న్యాయవ్యవస్థకు హ్యాట్సాఫ్: నాగబాబు

0

ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

తాజాగా హైకోర్టు తీర్పుపై జనసేన నేత – మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘భారత న్యాయవ్యవస్థకు హ్యాట్సాఫ్.. న్యాయవ్యవస్థ ప్రజల్లో విశ్వాసం నింపింది. అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చింది ’ అని ట్వీట్ చేశారు.

చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2016 జనవరి 30న ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియామకం అయ్యారు. ఏపీ సీఎంగా జగన్ వచ్చాక 2020 ఏప్రిల్ 10న ఆయనను తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్ చెల్లదని కొట్టి వేస్తూ ఆయనను తిరిగి నియమించాలని తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై నాగబాబు హర్షం వ్యక్తం చేశారు.
Please Read Disclaimer