జగన్ లోటస్ పాండ్ నివాసానికి రూ.24 లక్షల సర్కారు సొమ్ము ఖర్చు.. లోకేశ్ సైటైర్లు

0

వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నారా లోకేశ్ విమర్శల జోరు పెంచారు. జగన్‌ లక్ష్యంగా ట్వీట్ల మీద ట్వీట్లు వదులుతున్న ఆయన రోజు రోజుకూ విమర్శల పదును పెంచుతున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం రద్దు కావడం, 45 ఏళ్లు దాటిన వారికి పెన్షన్లు ఇస్తామన్న జగన్ మాట తప్పడం లాంటి అంశాలపై ఆయన చేసిన ట్వీట్లు జనాలను ఆకట్టుకున్నాయి. ఎక్కడికక్కడ అధికార పార్టీని ఎండగడుతున్న లోకేశ్.. మరోసారి జగన్‌పై పదునైన బాణాన్ని సంధించారు.

చంద్రబాబు హయాంలో దుబారా ఖర్చు జరిగిందని ఆరోపిస్తున్న జగన్ సర్కారు.. తాము పొదుపు బాటలో పయనిస్తున్నాం అని ప్రచారం చేసుకుంటోంది. బాబు హిమాలయా వాటర్ బాటిల్ వాడితే.. జగనన్న కిన్లే వాటర్ బాటిలే వాడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంది. కానీ హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని జగన్ నివాసానికి సీసీ కెమెరాలను అమర్చడానికి, పోలిస్ బారికేడ్ల నిర్మాణానికి రూ.24.5 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని వార్తలొచ్చాయి. ఇందుకు సంబంధించిన జీవో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

లోటస్ పాండ్ నివాసం కోసం రూ.24 లక్షలకు పైగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతుండటం పట్ల నారా లోకేశ్ మండిపడ్డారు. ‘‘ఇప్పుడే ఏమైంది, బెంగుళూరు ప్యాలెస్సు, ఇడుపులపాయ ఎస్టేటు, కడపలో గెస్ట్ హౌసు, పులివెందులలో భవంతి, ఇలా ఊరికి ఒక రాజ భవనం, ప్రతి రాజ భవనానికి ఒక జీఓ ఇస్తాం’’ అంటూ ఆయన ట్విట్టర్లో సెటైర్లు వేశారు.
Please Read Disclaimer