బిగ్ మిస్టేక్ : ఇది చూసి జగన్ సిగ్గుపడతారా గర్వపడతారా లోకేష్ సంచలనం!

0

మాములుగా రాజకీయ పార్టీల గళం విప్పడానికి పార్టీ అధినేత అన్ని సార్లు అన్ని వేళలా కుదరదు.పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలు ప్రతిపక్ష పార్టీలు ఇతర పార్టీలు చేసే విమర్శలకు ఒక్కో పార్టీ నుంచి కొంతమంది అధికార ప్రతినిధులు నియమించబడతారు.అయితే వారు చాలా విధానపరంగా విమర్శలు చెయ్యాలి కానీ పార్టీకు మరియు పార్టీ అధినేత కు ఎలాంటి మచ్చ తీసుకురాని విధంగా ప్రవర్తించాలి.

కానీ తాజాగా వైసీపీకు చెందిన ఒక అధికార ప్రతినిది అసలు ఒళ్ళు మర్చిపోయి మరీ తీవ్ర స్థాయి విమర్శలు చేసిన ఘటనను టీడీపీ మంత్రి నారా లోకేష్ బయటపెట్టారు.ఈరోజు జరిగిన ఒక డిబేట్ లో టీడీపీ అధికార ప్రతినిధిని ఉద్దేశించి “రా” చెప్పుతో కొడతా వంటి పరుష పదజాలం వాడారు.అసలు ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులను డిబేట్లలోకి రానివ్వరు ఒకవేళ వచ్చినా సరే ఆపేస్తారు.దీనితో ఈ వీడియో తీసుకొని నారా లోకేష్ సంచలన ట్వీట్ పెట్టారు.

“చేతకాని వాళ్ళకు నోరు ఎక్కువ అంటారు. వై ఎస్ జగన్ గారూ! మీరు చేస్తోన్న తుగ్లక్ పనులను ఎలా సమర్థించుకోవాలో తెలీక, మీ పార్టీ అధికార ప్రతినిధులు ఎలా అసహనానికి గురవుతున్నారో చూడండి. ప్రజలు చూస్తున్నారన్న స్పృహ లేకుండా ఎలా మాటలు తూలుతున్నారో చూసి గర్వపడతారో, సిగ్గుపడతారో మీ ఇష్టం.” అంటూ జగన్ విజ్ఞతకు వదిలేస్తున్నటుగా ట్వీట్ చేసారు.
Please Read Disclaimer