‘జగన్ గారికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా’

0

ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి టార్గెట్ చేశారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రకాశం జిల్లాలో టీడీపీ మహిళా కార్యకర్త ఇంటికి అడ్డంగా గోడ కట్టడంపై మండిపడ్డారు. ఆడవాళ్ల పట్ల జగన్‌కు ఉన్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇదే సైకోయిజం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘ప్రతీ అమ్మకి, ప్రతీ అక్కకి, ప్రతీ చెల్లికి చెప్పండి జగన్ గారి సైకోయిజం పీక్స్ కి చేరిందని. ఆఖరికి ఒంటరి మహిళని కూడా వైకాపా రౌడీలు వదలడం లేదు. టీడీపీ కార్యకర్తల ఇళ్లకి అడ్డంగా గోడలు కట్టారు. ఇప్పుడు ఏకంగా మహిళలపై దౌర్జన్యానికి దిగుతున్నారు’అని మండిపడ్డారు.

‘ప్రకాశం జిల్లా, తిమ్మారెడ్డిపాలెంలో ఆదిలక్ష్మమ్మ ఇంటి ముందు కట్టిన ఈ గోడ చూస్తేనే జగన్ గారికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థం అవుతుంది. వైకాపా గోడలతో ఇళ్ల నుండి బయటకు రాకుండా చెయ్యగలరేమో, కానీ ప్రజల్లో మీ చెత్త ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరు జగన్ గారు’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Please Read Disclaimer