‘యూ టర్న్ జగన్ గారూ.. కేసీఆర్ అప్పుడు హిట్లర్.. ఇప్పుడు భగీరథుడా’

0

ఏపీ అసెంబ్లీలో గోదావరి జలాల వినియోగం, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకంపై వాడీవేడి చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్.. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండటంతో తప్పు లేదన్నారు. కేసీఆర్ మంచి మనసుతో ఆలోచిస్తున్నారని.. నీటి పంపకాలపై ఇద్దరు ముఖ్యమంత్రులం చర్చలు జరిపామన్నారు. దీంతో టీడీపీ అభ్యంతరం తెలపగా.. సభలో గందరగోళం రేగింది. ఆ వెంటనే సభకు అడ్డు తగులుతున్నారని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

అసెంబ్లీలో మొదలైన నీట వాటాల మంటలు.. బయటకు పాకాయి. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. గతంలో కేసీఆర్‌ను హిట్లర్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. ‘నోటుకి ….నీళ్లు! హిట్లర్ కాస్తా ఒక్కసారిగా భగీరథునిగా మారిపోయాడు. ఒకప్పుడు జగన్ గారి జలదీక్షలో ఆంధ్రా నీళ్లు దోచేసిన కేసీఆర్ కాస్తా.. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆంధ్రాకి నీళ్లు దానం చేసే మనసున్న మారాజుగా మారారు’అంటూ ఎద్దేవా చేశారు.

‘యూ టర్న్ జగన్ గారూ! ఈ ఊసరవెల్లి వేషాలు మాని, ఎన్నికల్లో గెలుపు కోసం కట్టల సాయం అందుకున్నాం.. అందుకే రిటర్న్ గిఫ్ట్ గా గోదావరి నీటిపై ఆంధ్రా హక్కులు వదులుకుంటున్నాం అని చెప్పండి’అంటూ చురకలంటించారు.
Please Read Disclaimer