ట్రంప్ కోసం మోడీ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?

0

ప్రపంచానికి పెద్దన్న.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు భారత ప్రధాని నరేంద్రమోడీ ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదన్న విషయం తేటతెల్లమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో కలిసి గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు.

ట్రంప్ కేవలం 3 గంటలు మాత్రమే అహ్మదాబాద్ లో పర్యటిస్తారు. ఆయన మూడు గంటల పర్యటన కోసం మోడీసార్ ఏకంగా అహ్మదాబాద్ లో రూ.100 కోట్లు ఖర్చు చేస్తుండడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇందులో కేవలం 14 కోట్లు మాత్రమే కేంద్రం భరిస్తుండగా.. మిగతాదంతా గుజరాత్ సర్కారే కేటాయించింది.

ఇందులో ట్రంప్ భద్రతకు రూ.12 కోట్లట.. ఇక దాదాపు లక్షమంది అతిథుల కోసం రూ.10 కోట్లు రోడ్ల మధ్యలో ఈత జాతి చెట్ల కోసం ఏకంగా 6కోట్లు.. ట్రంప్ రోడ్ షోకు 10వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.

ఇలా ట్రంప్ 3 గంటల పర్యటన కోసం పైసలను పప్పు బెల్లాల్లా మోడీ సార్ ఖర్చు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఎంత తాను గొప్ప లీడర్ ను అని నిరూపించుకునేందుకు ఇంతలా మోడీ ఖర్చు చేయాలా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-