కేశినేని తాజా పోస్ట్ కు రియాక్షన్ మామూలుగా లేదుగా?

0

గడిచిన కొద్ది రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మహా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ తీరును తప్పు పడుతూ పోస్టులు పెట్టే ఆయన.. బాబు పట్ల తనకున్న విధేయతను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన పెట్టిన పోస్టుపై నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కామెంట్లు అయితే.. దిమ్మ తిరిగే స్థాయిలో పంచ్ ల రూపంలో ఉన్నాయి.

తన ఫేస్ బుక్ అకౌంట్లో కేశినేని నాని ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో సగ భాగం అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను కూల్చేసిన ఫోటోను.. మరో సగ భాగంలో విజయవాడ- సింగపూర్ విమాన సర్వీసుల్ని నిలిపివేసిన వైనాన్ని తెలిపేలా ఫోటో పెట్టారు. ఇందుకు ట్యాగ్ గా అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్ ను అభివృద్ధి చేద్దామని పేర్కొన్నారు.

దీనిపై పలువురు నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక నెటిజన్ కాస్త సీరియస్ గా పంచ్ పోస్ట్ చేశారు. సదరు నెటిజన్ చేసిన కామెంట్ ను యథాతధంగా చూస్తే.. అందుకేనా సారూ మీ పిల్లలు హైదరాబాద్ లో కార్గో వ్యాపారం – బాబు గారు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంది? రీసెంట్ గా మీ దేవినేని ఉమా కూడా 7 బెడ్రూం విల్లా కొన్నారు

పుల్లారావు గారు 70 ఎకరాల లేఔట్ వేశారన్నారు. ఈ సమాధానం ఇలా ఉంటే మరొకరు స్పందిస్తూ.. అయ్యా నాని గారు – మీరు ప్రజా ప్రతినిధులు సార్ – మీరు ఏదయినా మంచి జరగాలని కోరుకోవాలి కాని.. ఎదో ఎవడో ప్రైవేట్ కంపెనీ వాడు విమానాలు ఆపేస్తే దానికి మీరు ఇలా స్పందించటం అసలు బాగోలేదని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే.. కేశినేని పోస్ట్ కు మరొకరు స్పందిస్తూ.. నీకు ఈ జన్మ కి సిగ్గు రాదు నాని … జగన్ మోహన్ రెడ్డి మీద ఏడుస్తూనే కాలం గడిపేసేలా ఉన్నావ్ – 70వేల మెజారిటీ నుండి 7000 కి వచ్చావ్ … జనం నిన్ను ఛీ కొట్టారు అవునా నీకు సిగ్గు రాలేదంటూ ఫైర్ అయ్యారు. ప్రత్యర్థుల మీద పంచ్ డైలాగులు వేయటం బాగానే ఉంటుంది. కానీ.. సోషల్ మీడియాలో అందుకు వస్తున్న రియాక్షన్ కు కేశినేని లాంటోళ్లు సమాధానాలు చెప్పలేని రీతిలో రియాక్షన్ ఉండటం గమనార్హం.
Please Read Disclaimer