ప్రధాన పత్రికకు కరోనా సెగ..16మందికి పాజిటివ్

0

హైదరాబాద్ లో కరోనా విచ్చలవిడిగా అందరికీ సోకుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పెద్దగా టెస్టులు చేయకపోవడంతో ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియడం లేదు. ఉన్నవారు కరోనా బాంబర్లుగా మారి అందరికీ అంటించేస్తున్నారు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చి తెలుగులోనే ప్రధాన పత్రిక తన ఉద్యోగులైన జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేయించిందట ఇందులో షాకింగ్ విషయం బయటపడినట్టు మీడియా వర్గాల సమాచారం.

సదురు ప్రధాన పత్రికకు కరోనా సెగ తగిలిందట. ఒకటి కాదు రెండు కాదు.. ప్రధాన కార్యాలయంలోని 125మందికి కరోనా టెస్టులు చేయిస్తే ఏకంగా 16మందికి పాజిటివ్ గా బయటపడడంతో ఆ మీడియా సంస్థ ఉలిక్కిపడింది.ఈ పదహారు మంది ఎవరెవరితో కాంటాక్ట్స్లో ఉన్నారు? అనే విషయాన్ని ఇప్పుడు ఆరా తీస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకూ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.

ఇక ఇదే సంస్థకు సేఫ్ జోన్ గా ఉన్న మరో కార్యాలయం నుంచే మేజర్ వర్క్ జరుగుతుంటుంది. అక్కడి నుంచే రెండు రాష్ట్రాల్లో పరిపాలన అంతా సాగుతుంటుంది. దీంతో అక్కడ కూడా టెస్టులు చేయిస్తే ఇంకా ఎంతమందికి పాజిటివ్ గా తేలుతుందోనని సంస్థ భయపడుతోందట..ఇప్పటికే సదురు మేజర్ సంస్థలో 2 కేసులు బయటపడినట్టు సమాచారం.

కరోనా భయాల మధ్య ఆ మీడియా సంస్థ రిపోర్టర్లు సబ్ ఎడిటర్స్ ఆఫీసులకు వెళ్లడానికే భయపడుతున్నారు. కానీ యాజమాన్యం మాత్రం వరుసగా సెలవులు తీసుకుంటున్నవాళ్లపై సీరియస్గా దృష్టి పెడుతోంది. వెళితే కరోనా భయం. వెళ్లకపోతే.. ఉద్యోగం పోతుందేమో అన్న ఆందోళన. ఈ రెండింటి మధ్య బతుకు వెళ్లదీస్తున్నారు ఆ సంస్థ ఉద్యోగులు.
Please Read Disclaimer