సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ.. పన్ను ఎంతంటే?

0

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన జీఎస్టీ వసూళ్ల పై కీలక ప్రతిపాదనలు చేశారు. జీఎస్టీ ఒకే దేశం.. ఒకే పన్ను విధానం మంచి ఫలితాన్ని ఇచ్చిందని నిర్మల పేర్కొన్నారు.

ఇక ఈ కోవలోనే ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం అమలు చేస్తామని నిర్మల ప్రకటించారు. దీని వల్ల ప్రజలపై పదిశాతం వరకూ పన్ను భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

జీఎస్టీ వల్ల గత రెండేళ్లలోనే కొత్తగా 16లక్షల మంది పన్ను చెల్లింపు దారులు పెరిగారని నిర్మల పార్లమెంట్ లో ప్రకటించారు. ఏకంగా 40 కోట్ల మంది పన్ను రిటర్న్ ఫైల్ చేశారని ఇది తమ ఘనతగా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జీఎస్టీ పన్ను ఆదాయం పెరుగుతుందని.. జీఎస్టీ రిటర్న్స్ మరింత సులభతరం అయ్యిందన్నారు.

జీఎస్టీ వసూలు జనవరి రూ.1.1 లక్షల కోట్లు దాటాయని నిర్మల పార్లమెంట్ లో ఘనంగా ప్రకటించారు. 2019 జనవరి ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి ఆదాయం 12శాతం వృద్ధిని కనబరిచిందని తెలిపారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన 2017 నుంచి లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి కావడం విశేషం.
Please Read Disclaimer