ప్రియాంక హత్య లో మరో ట్విస్ట్..నలుగురు కాదు ఐదుగురు?

0

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసులో విచారణ జరిగేకొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఒక పథకం ప్రకారం ప్రియాంక రెడ్డి పై నిఘా పెట్టి .. అతి దారుణంగా అఘాయిత్యం చేసి – హత్య చేసారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది. ప్రియాంకా రెడ్డి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశంలోని ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో చెప్తున్నారు. దీనితో వీరిని ఈ రోజు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో మేజిస్ట్రేట్ పాండునాయక్ ఎదుట పోలీసులు నలుగురు నిందితులను హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

ఇకపోతే ప్రియాంక హత్యలో కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే .. ఆమెపై నలుగురు కాకుండా ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి – హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఐదో వ్యక్తి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడు నారాయణపేట జిల్లా పొర్లకు చెందిన యువకుడిగా గుర్తించినట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్టు సమాచారం.

ఇకపోతే దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన తర్వాత ఇండియాలో అత్యాచార చట్టాన్ని కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. నిర్భయ చట్టం కింద ఏ వ్యక్తైనా అమ్మాయిలను వెంటాడినా – చూపులతో వేధించినా నేరమే. అయితే అత్యాచారాలకు పాల్పడుతున్న దోషులకు కఠిన శిక్షలు లేకపోవడం వల్ల నేరాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఒకసారి దృష్టి పెడితే తప్పా ఈ దారుణాలకు అడ్డుకట్ట వేయలేము.
Please Read Disclaimer