హైదరాబాద్‌లో దారుణం… పెళ్లన ఐదురోజులకు నవవధువు

0

హైదరాబాద్‌లో ఓ నవవధువు కనిపించకుండా పోయింది. ఈ ఘటన కాచిగూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కామ్‌గార్‌ నగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణతో అనే యువకుడితి … ఐశ్వర్య అనే 20 ఏళ్లకు ఇచ్చి వివాహం చేశారు. ఈనెల 20న బంధుమిత్రులు, కుటుంబసభ్యుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అంతా బాగానే జరిగింది. ఇద్దరూ భార్యభర్తలు తమ కొత్త జీవితం ప్రారంభించారు. ఇంతలోనే ఉగాది పండగ వచ్చింది. దీంతో సరుకులు కొనేందుకు ఐశ్వర్య బయటకు వెళ్తానంది. దీంతో కుటుంబసభ్యులు సరే అన్నారు. ఉగాది పండగ కోసం నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి ఐశ్వర్య కిరాణాషాపునకు వెళ్లింది.

అయితే ఎంతసేపైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త కిరాణా షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ ఐశ్వర్య కనిపించలేదు. అక్కడ ఇక్కడ అన్నిచోట్ల వెతికాడు. తెలిసిన వారిని, తెలియని వారిని అందర్నీ ఆరా తీశాడు. ఎక్కడ వెతికినా ఫలితం కనిపించలేదు. ఐశ్వర్య జాడ దొరకలేదు. దీంతో గురువారం భర్త సత్యనారాయణ కాచిగూడ పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఐశ్వర్యను మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఐశ్వర్యను ఎవరైనా కిడ్నాప్ చేశారా ? లేక ఆమే ఎక్కడికైనా వెళ్లిపోయిందా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఐశ్వర్య స్నేహితుల్ని విచారిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-