పెళ్లైన తెల్లారే వధువు జంప్.. ఎవరితో ఉందో తెలిసి షాక్

0

పెళ్లి పీటల మీద నుంచి వధువు పారిపోవడం తరచుగా మనం వింటూనే ఉంటాం. ఇక్కడ మాత్రం కాస్త వెరైటీగా పెళ్లైన మరుసటి రోజు వధువు జంపైపోయింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తర్వాత అందరూ ప్రేమ వ్యహారం అనుకొని వదిలేశారు. సీన్ కట్ చేస్తే 23 రోజుల తర్వాత ఆమె ఆచూకీ దొరికింది. పొరుగు రాష్ట్రంలో ఉందని తెలుసుకొని సంతోషపడ్డారు.. కానీ తర్వాత ఆమె ఎవరి కోసం వెళ్లిపోయిందో తెలుసుకొని బంధువులతో పాటూ పోలీసులు నోరెళ్లబెట్టారు.

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ నెల మొదటివారంలో రాజస్థాన్‌కు చెందిన యువతికి.. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన యువకుడితో వివాహమయ్యింది.. మరుసటి రోజే వధువు ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఎటు వెళ్లిందోనని కంగారుపడిన కుటుంబ సభ్యులు, అత్తింటివారు ఆచూకీ కోసం గాలించారు. ఫలితం కనిపించకపోవడంతో.. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

వధువు కోసం పోలీసులు రాజస్థాన్, యూపీలో గాలించారు.. అయినా ఫలితం దక్కలేదు. సీన్ కట్ చేస్తే రెండు రోజుల క్రితం ఆమె జాడ తెలుసుకున్నారు. హర్యానాలోని మనేసర్‌లో ఆమె ఉన్నట్లు తెలిసింది. ఆమె ఇన్ని రోజులు ఎవరితో ఉందని ఆరా తీసిన బంధువులకు షాక్ తగిలింది. ఆమె మరో యువతితో సంబంధం పెట్టుకొందట.. లెస్బియన్ భాగస్వామితో కలిసి ఉండేందుకు పెళ్లైన మరుసటి రోజు భర్తను వదిలేసి పారిపోయి వచ్చిందట. ఈ విషయం తెలుసుకొని బంధువులతో పాటూ పోలీసులు షాక్ తిన్నారు. 

ఈ వధువుకు నాలుగేళ్ల నుంచి ఓ యువతితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. మొత్తానికి కష్టపడి వధువు జాడ కనిపెట్టిన పోలీసులు.. ఈ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయగా.. తాము మేజర్లమని ఎవరితో కలిసి ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఉందని లా పాయింట్లు తీస్తున్నారట. ఏం చేయాలో అర్ధంకాని పోలీసులు.. ఇద్దర్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 
Please Read Disclaimer