నిర్భయ దోషికి ఎంత ఒళ్లు బలుపంటే?

0

కొన్నేళ్ల క్రితం నిర్భయ ఉదంతం దేశం మొత్తాన్ని దిగ్భాంత్రికి గురి చేయటమే కాదు.. అంత పాశవికంగా హింసించిన దోషుల్ని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది. దేశంలోని న్యాయవ్యవస్థ పుణ్యమా అని నిర్భయ నిందితుల్ని దోషులుగా సుప్రీంకోర్టు తేల్చేసినప్పటికీ.. వారికి విధించిన ఉరిని మాత్రం ఇప్పటివరకూ అమలు చేయలేదు.

ఇదిలా ఉంటే.. నిర్భయ కేసులో దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తాజా చర్య విన్నంతనే ఒళ్లు మండేలా ఉంది. తనకు క్షమాభిక్ష విధించాలని అతగాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఒక దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. దీన్ని రాష్ట్రపతి రిజెక్టు చేశారు. ఇదిలా ఉంటే.. తన పేరుతో వచ్చిన క్షమాభిక్ష్ పిటిషన్ ను తక్షణమే వెనక్కి పంపాలని.. తాను దాన్ని దాఖలు చేయలేదంటూ బలుపు వ్యాఖ్యలు చేశారు.

వినయ్ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించగా.. ఆ తర్వాత అది కేంద్ర హోంశాఖకు చేరుకుంది. అనంతరం దాన్ని రాష్ట్రపతికి పంపారు. ఇదిలా ఉంటే తాను క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయలేదని పేర్కొనటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చేసిన దుర్మార్గానికి వేదన చెందుతూ ఊరుకుండాల్సిన వినయ్ శర్మ లాంటోళ్లు బలుపు మాటలు చూస్తే.. అలాంటోళ్లను ఎప్పటికి ఊరి తీస్తారన్న క్వశ్చన్ మదిలో మెదలక మానదు.
Please Read Disclaimer