ఒంటరి పోరాటం చేస్తున్న జగన్..మంత్రులు జాడే లేదు

0

2019 ఎన్నికల సమయంలో జగన్ చెప్పిన పనులు చిన్న చిన్న ఒక్కొక్కటి చేయటానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు, ఒక్కో పనికి ఒక్కో టైం లిమిట్ పెట్టుకొని ముందుకి వెళ్తున్నాడు. అయితే కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయడానికి కుదరటం లేదు, ఎన్నో అవరోధాలు, ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి, వాటిని పరిష్కరించుకునే క్రమంలో ఇబ్బందులు ఉంటాయి, అందువలన అనుకోని ఆలస్యం జరుగుతుంది.

దీనిని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూ, చెప్పిన పనులు సరైన సమయానికి చేయటం లేదంటూ విమర్శలు చేస్తున్నాయి. వాటినే జనాలు నిజం అని నమ్మే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సమయంలోనే అధికారపక్షము నుండి వాటిని ఖండిస్తూ మాట్లాడే వాళ్ళు కావాలి. సీఎం జగన్ ఉంటే మాట్లాడేది తక్కువ, తన పని ఏమిటో తాను చూసుకుంటూ పోతున్నాడు, కాబట్టి ఆ బాధ్యతని మంత్రులు తీసుకోవాలి. ప్రతి పక్షము చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇవ్వాలి.

కానీ వైసీపీ పార్టీలో ఆ బాధ్యత తీసుకునే మంత్రలు ఎవరు కూడా కనిపించటం లేదు. మొన్నటిదాకా యాక్టీవ్ గా కనిపించే ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ఏమైందో ఏమో కానీ, కనీసం ఎక్కడ కూడా కనిపించటం లేదు, బలంగా తమ వాదనని ప్రజల్లోకి తీసుకోని వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి ధోరణి పార్టీకి మంచిది కాదు, ఎందుకంటే చెడు అనేది త్వరగా చేరిపోతుంది, దానిని ఆపే బాధ్యత వైసీపీ మంత్రులది. ఆలా చేయకపోతే 2024 ఎన్నికలలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Please Read Disclaimer