మాంసం – కూల్ డ్రింక్స్ .. యమ డేంజర్..

0

మాంసం.. అదే నాన్ వెజ్ విరివిగా తింటున్నారా.? మాంసం లేనిదే ముద్ద దిగడం లేదా.? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే.. ఇక అధిక కెలోరీలు కలిగిన శీతల పానీయాలు రోజూ అతిగా తాగుతున్నారా.? అయితే జాగ్రత్త.. వాటివల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో .. అతిగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అంతే ప్రమాదం. దీని వల్ల స్త్రీ పురుషుల్లో పెద్ద పేగుల క్యాన్సర్ ముప్పు వచ్చే అవకాశం ఉంది. బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు గత 26 ఏళ్లుగా దాదాపు లక్షా 21వేల మంది స్త్రీ పురుషులపై విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయా వ్యక్తులు తినే ఆహారం – వారి ఆరోగ్య పరిస్థితుల గురించి లోతుగా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా అతిగా మాంసం – అధిక కెలోరీలు కలిగిన శీతల పానీయాలు తాగేవారిలో పెద్ద పేగు క్యాన్సర్ ఏర్పడినట్లు గుర్తించారు. అలాగే శుద్ధి చేసిన ధాన్యాలను అతిగా తీసుకున్న వారిలో కూడా ఈ లక్షణాలు కనిపించినట్లు పేర్కొన్నారు.

పరిశోధనను బట్టి అతి అనర్థదాయకమంటున్నారు. కాబట్టి మాంసాహారమైనా – శాఖహారమైనా సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేకపోతే దీర్ఘకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.
Please Read Disclaimer