ఆస్ట్రేలియా నుంచి వచ్చి భార్య ను బుక్ చేసిన ఎన్ ఆర్ ఐ

0

హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే చైతన్యపురిలో బయట పడిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన భార్య వేరే వారితో అక్రమ సంబంధం ఉందన్న విషయాన్ని అనుమానించిన భర్త.. ఆ విషయాన్ని నిరూపించేందుకు ఆస్ట్రేలియా నుంచి నేరుగా ఇంటికి రావటమే కాదు.. పోలీసుల ఎదుటే ప్రూవ్ చేశారు.

చైతన్యపురికి చెందిన ఒకరు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నారు. తన భర్త వేరే ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకున్నాడు. పక్కా సమాచారాన్ని సేకరించిన సదరు వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి నేరు గా శంషాబాద్ కు వచ్చారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారి సాయంతో తన ఇంటికి చేరుకున్నాడు. తలుపు కొట్టిన అతడికి.. తలుపు తీసిన అతడి భార్య కు విదేశం నుంచి తిరిగి వచ్చిన భర్తను చూసి షాక్ తింది.

ఆమెకు ఒక డాక్టర్ తో వివాహేతర సంబంధం ఉందన్న విషయం తాజాగా బయటకొచ్చింది. ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ ఏమంటే.. వివాహేతర సంబంధం ఉన్న భార్య ను.. సదరు డాక్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..పక్క ఇంట్లో ఎవరు ఉంటున్నారని క్యాజువల్ గా అడిగారు.

దానికి తనకు తెలీదనటంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ఆ డోర్ ను తలుపు తట్టారు. బయటకు వచ్చిన జంట.. పోలీసుల్ని చూసి కంగుతిన్నారు. మీరిద్దరు ఏమవుతారంటే నీళ్లు నమిలారు. వారిద్దరిది కూడా అక్రమ సంబంధమేనని ఒప్పుకున్నారు. ఇలా ఒకే అపార్ట్ మెంట్ లో వెలుగు చూసిన ఈ రెండు ఉదంతాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే.. సుప్రీంకోర్టు తీర్పు ను ప్రాతిపదికగా తీసుకుంటే.. వివాహేతర సంబంధం నేరం కాదు. ఇష్టపడిన ఇద్దరు కలిసి ఉండటం.. సెక్స్ చేయటం నేరం కాదన్న తీర్పు నేపథ్యం లో కేసు ఎలా నమోదు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Please Read Disclaimer