కడుపంతా కిలోన్నర బంగారం..

0

అన్నం తింటారు.. బిస్కెట్లు తింటారు..కానీ ఈ మహిళ బంగారం- వెండి- రాగితోపాటు నాణేలను ఫలహారంగా భుజించింది. ఒకటి కాదు.. రెండు కాదు కడుపునిండా మొత్తం కిలోన్నర ఆభరణాల గనిగా మార్చేసింది. ఓ రోజు తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యేసరికి అసలు విషయం బయటపడింది.

పశ్చిమ బెంగాల్ లోని భీర్ భూమ్ జిల్లాలో నివాసం ఉంటున్న ఓ ఇంట్లో బంగారం- వెండి- రాగి – రూ.5- రూ.10 నాణేలు వరుసగా మాయమయ్యేటివి. నగలు- బంగారు గొలుసులు- ముక్కుపుడుక- కమ్మలు- గాజులు- బ్రేస్ లెట్లు వాచీలు కనిపించకపోయే సరికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఓ రోజు ఆ ఇంట్లోని మహిళకు తీవ్ర కడుపునొప్పి రావడంతో రామ్ పుర్హాత్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్ తీస్తే దిమ్మదిరిగినంత పని అయిపోయింది. పొట్ట నిండా ఏవో వస్తువులు చైన్లు ఉన్నట్టు గుర్తించారు.

ఆ మహిళకు ఆపరేషన్ చేసి బంగారు వెండి రాగి ఆభరణాలు 90 కాయిన్లను అతికష్టం మీద వెలికితీశారు. తన ఇంట్లో మాయమవడం పై గత కొద్దిరోజులు మథనపడిన ఆ మహిళ తల్లి కూతురు కడుపులోనే అవి ఉండడం.. వైద్యులు వెలికితీయడంపై షాక్ కు గురైంది. కాగా మహిళకు మతిస్థిమితం లేనట్టు ఆ తల్లి తెలిపింది. తమకు తెలియకుండా ఈ నగలు ఎప్పుడు తిన్నదో తెలియదని వారు పేర్కొన్నారు.
Please Read Disclaimer