భారత్ కావాలని ఆ రెండు మ్యాచ్ లు ఓడిపోనుంది!

0

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో అపజయం లేకుండా వరుసగా విజయాలు సాధిస్తూ టీం ఇండియా సెమీస్ కు దూసుకు పోయింది. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న టీం ఇండియా కప్ పై కన్నేసింది. ఇదే సమయంలో దాయాదీ దేశం అయిన పాకిస్తాన్ మాత్రం సెమీస్ కు వెళ్లాలి అంటే మరో మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఇదే సమయంలో బంగ్లా దేశ్ మరియు శ్రీలంకలు గెలిస్తే పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో టీం ఇండియాపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు బసిత్ అలీ చెత్త వ్యాఖ్యలు చేశాడు.

ఒక టీవీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లడం భారత్ కు ఎప్పుడు ఇష్టం ఉండదు. అందుకే వారు తదుపరి ఆడబోతున్న బంగ్లాదేశ్ మరియు శ్రీలంకతో మ్యాచ్ లలో ఉద్దేశపూర్వకంగా ఓడిపోయే అవకాశం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేశాడు. అఫ్గానిస్తాన్ పై భారత్ అలా ఆడటంకు కారణం కూడా పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లవద్దనే అంటూ అతడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లకుండా ఉండేందుకు భారత్ ఎంతకైనా సిద్దపడుతుందని బసిత్ అలీ చేసిన కామెంట్స్ పై ఇరు దేశాల క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్రికెట్ అనేది జెంటిల్ మన్ గేమ్. ఇండియా జట్టు లోని ప్రతి ఒక్క ఆటగాడు కూడా జెంటిల్ మన్ తరహాలో వ్యవహరిస్తారు. క్రీడా స్ఫూర్తితో భారత ఆటగాళ్లు వ్యవహరిస్తారు. గతంలోని సందర్బాలు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. నీలాంటి మ్యాచ్ ఫిక్సర్లకు ఆ విషయం ఏం తెలుస్తుంది. నీది అలాంటి బుద్ది కనుక నీ ఆలోచన ఇలాగే ఉంటుందంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు. టీం ఇండియా ఆ రెండు జట్లపై కూడా విజయాన్ని సొంతం చేసుకున్ని పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో నిలిచి సెమీస్ కు వెళ్తుందని టీం ఇండియా అభిమానులు అంటున్నారు. పాకిస్తాన్ సెమీస్ కు వెళ్తే మళ్లీ పాక్ ను చిత్తు చేసేందుకు టీం ఇండియా సిద్దంగానే ఉందని.. భయపడి సెమీస్ కు రాకుండా చేయాల్సిన అవసరం టీం ఇండియాకు లేదంటూ క్రీడాభిమానులు అంటున్నారు.
Please Read Disclaimer