టీడీపీతో పొత్తు..పవన్ మళ్లీ అదే మాట!టీడీపీతో పొత్తు..పవన్ మళ్లీ అదే మాట!

0

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు అనంతరం తాజా ఎన్నికల్లో దూరమవడంపై ఇప్పటికే పలు సందర్భాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు ఆయన రియాక్టయ్యారు. బీజేపీ – టీడీపీతో విడిపోయాం కనుకే వైసీపీ బలపడిందని పవన్ పేర్కొన్నారు. తాజాగా పార్టీ నేతలతో జరిగిన ముఖ్య సమావేశంలో పవన్ ఈ మాటలు చెప్పుకొచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికలు రాజధాని అంశాలపై మంగళగిరి పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ప్రజలకు మంచి పాలన అందాలనే ఉద్దేశంతో 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. “ఆ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చిన తర్వాత కొన్ని కారణాలతో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి 2019లో ఒంటరిగా పోటీ చేశాం. బీజేపీ – తెలుగుదేశం – జనసేన పార్టీ విడిపోయాయి కనుక వైసీపీ బలపడింది. “ అని నేతలకు వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అనుభవం ఉన్నవారితోపాటు యువతరానికి పెద్ద పీట వేస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి నిస్వార్ధంగా పార్టీ జెండా మోసిన యువతకు 50 శాతం టికెట్లు ఇచ్చి నిలబెడతామని అన్నారు. స్థానిక పోరులో కుల – వర్గ పోరాటాలతో పాటు దౌర్జన్యాలు ఉంటాయని – ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు. తెగింపు లేకపోతే ముందుకు వెళ్లలేమన్న పవన్ కళ్యాణ్ కొత్తరక్తం రాకపోతే రాజకీయాల్లో మార్పు రాదని స్పష్టం చేశారు.
Please Read Disclaimer