Templates by BIGtheme NET
Home >> REVIEWS >> ఆర్జీవీ ‘థ్రిల్లర్’ రివ్యూ

ఆర్జీవీ ‘థ్రిల్లర్’ రివ్యూ


కరోనా సమయంలో కూడా సినిమాలు తీస్తూ ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘థ్రిల్లర్’. NNN(నగ్నం) సిరీస్ లో భాగంగా రూపొందిన ఈ సినిమాలో అప్సరా రాణి – రాక్ కచ్చి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాని కంపెనీ ప్రొడక్షన్స్ మరియు సౌత్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ‘థ్రిల్లర్’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ ట్రైలర్ లు ఓ సెక్షన్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేయడం.. వర్మ ట్విట్టర్ లో షేర్ చేసిన అప్సర రాణి వేడిపుట్టించే ఫోటోలు చూసి ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆర్జీవీ వరల్డ్ థియేటర్ – శ్రేయాస్ ఈటీ యాప్ ద్వారా ‘థ్రిల్లర్’ మూవీ తెలుగు – హిందీ – తమిళ్ – మలయాళం – కన్నడ – మరాఠీ – భోజపురి – గుజరాతీ – ఒడియా భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాగా ‘నగ్నం’ అనే చిన్న సినిమా తీసి ఆడియన్స్ వీక్ నెస్ ని క్యాష్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ మరోసారి ‘థ్రిల్లర్’ సినిమాతో ఫూల్స్ చేసాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూడు పాత్రలతో రూపొందించిన 22 నిమిషాలు నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్.. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ‘థ్రిల్లర్’ పోస్టర్స్ చూసి ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు అండ్ థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయని ఎక్సపెక్ట్ చేసిన వారు వర్మ చేతిలో మరోసారి మోసపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో అలాంటివి మచ్చుకు కూడా కనిపించవు. థ్రిల్లింగ్ కోసం ‘థ్రిల్లర్’ సినిమా చూడటం కంటే.. యూట్యూబ్ లో ఏదొక వీడియో చూడటం నయమని విమర్శిస్తున్నారు.

ఇద్దరు ప్రేమికులు ఓ ఇంట్లోకి ప్రవేశించడం.. వారికి అక్కడ అనుకోని సంఘటనలు ఎదురుకావడం.. అప్పుడే ఆ ప్రేయసి తన ప్రియుడిని చంపేయడం.. అదే సమయంలో ఆ ఇంట్లో మరో అదృశ్య వ్యక్తి దూరడం.. ఈ క్రమంలో ఆ ఇంటిలో ఎదురైన సంఘటనలతో ఆ అమ్మాయి ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొంది.. తన ప్రియుడుని ఎందుకు చంపింది.. అనే వాటికి సమాధానమే ‘థ్రిల్లర్’ మూవీ కథ. అయితే వర్మ గత చిత్రాల వలె సబ్జెక్ట్ లేకుండా రూపొందించిన చిత్రంగా ‘థ్రిల్లర్’ మిగిలిపోయింది. కేవలం కెమెరా యాంగిల్స్.. రెండు మూడు సన్నివేశాల్లో మ్యూజిక్ తప్ప ఈ సినిమాలో ఇంకేమీ లేదు. ‘నగ్నం’ సినిమాకి మించి ప్రేక్షకులు ‘థ్రిల్లర్’ లో ఊహించుకుంటే నిరాశపడక తప్పదు. మొత్తం మీద ట్రైలర్ లోనే సినిమాను చూపించిన వర్మ.. సినిమాలో కూడా ట్రైలర్ మాత్రమే చూపించి ప్రేక్షకుల బలహీనతను క్యాష్ చేసుకున్నాడని చెప్పవచ్చు.

కరోనా సమయంలో కూడా సినిమాలు తీస్తూ ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'థ్రిల్లర్'. NNN(నగ్నం) సిరీస్ లో భాగంగా రూపొందిన ఈ సినిమాలో అప్సరా రాణి - రాక్ కచ్చి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాని కంపెనీ ప్రొడక్షన్స్ మరియు సౌత్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. 'థ్రిల్లర్' ఫస్ట్ లుక్ మరియు టీజర్ ట్రైలర్ లు ఓ సెక్షన్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేయడం.. వర్మ ట్విట్టర్ లో షేర్ చేసిన అప్సర రాణి వేడిపుట్టించే ఫోటోలు చూసి ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆర్జీవీ వరల్డ్ థియేటర్ - శ్రేయాస్ ఈటీ యాప్ ద్వారా 'థ్రిల్లర్' మూవీ తెలుగు - హిందీ - తమిళ్ - మలయాళం - కన్నడ - మరాఠీ - భోజపురి - గుజరాతీ - ఒడియా భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా 'నగ్నం' అనే చిన్న సినిమా తీసి ఆడియన్స్ వీక్ నెస్ ని క్యాష్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ మరోసారి 'థ్రిల్లర్' సినిమాతో ఫూల్స్ చేసాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూడు పాత్రలతో రూపొందించిన 22 నిమిషాలు నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్.. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 'థ్రిల్లర్' పోస్టర్స్ చూసి ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు అండ్ థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయని ఎక్సపెక్ట్ చేసిన వారు వర్మ చేతిలో మరోసారి మోసపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో అలాంటివి మచ్చుకు కూడా కనిపించవు. థ్రిల్లింగ్ కోసం 'థ్రిల్లర్' సినిమా చూడటం కంటే.. యూట్యూబ్ లో ఏదొక వీడియో చూడటం నయమని విమర్శిస్తున్నారు. ఇద్దరు ప్రేమికులు ఓ ఇంట్లోకి ప్రవేశించడం.. వారికి అక్కడ అనుకోని సంఘటనలు ఎదురుకావడం.. అప్పుడే ఆ ప్రేయసి తన ప్రియుడిని చంపేయడం.. అదే సమయంలో ఆ ఇంట్లో మరో అదృశ్య వ్యక్తి దూరడం.. ఈ క్రమంలో ఆ ఇంటిలో ఎదురైన సంఘటనలతో ఆ అమ్మాయి ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొంది.. తన ప్రియుడుని ఎందుకు చంపింది.. అనే వాటికి సమాధానమే 'థ్రిల్లర్' మూవీ కథ. అయితే వర్మ గత చిత్రాల వలె సబ్జెక్ట్ లేకుండా రూపొందించిన చిత్రంగా 'థ్రిల్లర్' మిగిలిపోయింది. కేవలం కెమెరా యాంగిల్స్.. రెండు మూడు సన్నివేశాల్లో మ్యూజిక్ తప్ప ఈ సినిమాలో ఇంకేమీ లేదు. 'నగ్నం' సినిమాకి మించి ప్రేక్షకులు 'థ్రిల్లర్' లో ఊహించుకుంటే నిరాశపడక తప్పదు. మొత్తం మీద ట్రైలర్ లోనే సినిమాను చూపించిన వర్మ.. సినిమాలో కూడా ట్రైలర్ మాత్రమే చూపించి ప్రేక్షకుల బలహీనతను క్యాష్ చేసుకున్నాడని చెప్పవచ్చు.

ఆర్జీవీ 'థ్రిల్లర్' రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 1.75
నటీ-నటుల ప్రతిభ - 2.25
సాంకేతిక వర్గం పనితీరు - 2.25
దర్శకత్వ ప్రతిభ - 1.5

1.9

ఆర్జీవీ 'థ్రిల్లర్' రివ్యూ

ఆర్జీవీ 'థ్రిల్లర్' రివ్యూ

User Rating: Be the first one !
2