ఏం రాజన్న పాలనో వృద్ధులను కూడా వదలట్లేదు!

0

ఏపీలో మొట్టమొదటి సారి వై ఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు.దీనితో అతని తండ్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను మరపిస్తాడు అని అంతా భావించారు.కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఈ పాలన అయితే జరుగుతుందని కొన్ని కొన్ని నిజాలు చూస్తే నమ్మక తప్పడం లేదు.ఓ పక్క జగన్ ఎప్పటి నుంచో కూడా అవినీతి రహిత పాలనను అందిస్తానని చెప్తున్నారు కానీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు సహా ఆయన నియమించిన గ్రామ వాలంటీర్లు కూడా చేతి వాటం ప్రదర్శిస్తున్నారు.

ఆఖరుకు నెలకు వచ్చే పింఛను డబ్బులతో జీవనం గడిపే వృద్ధుల దగ్గర నుంచి కూడా లంచాలు తీసుకున్తున్నారంటే ఇక ఎవరికీ నోట మాట రావడం లేదు.అనంతపురం జిల్లా కదిరిలోని పింఛను ఇచ్చే అధికారులు అక్కడ వృద్ధుల నుంచి తలా 50 రూపాయలు పింఛను డిమాండ్ చేశారన్న వార్త బయటకు వచ్చింది.వాళ్లకి ఇచ్చేదే 2250 అందులోను 50 వారికే ఇవ్వమన్నారు లేదంటే పింఛను ఇవ్వమని చెప్పి మరీ దసరా మాములు అని చెప్పి ఆ 50 తీసుకున్నారు.మరి జగన్ చెప్పిన రాజన్న పాలన అంటే ఇదేనేమో..
Please Read Disclaimer