పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు.. ఈరోజు కూడా రేట్లు పైకే!

0

దేశీ ఇంధన ధరలు సామాన్యులకు షాకిస్తూనే ఉన్నాయి. ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి. దేశీ ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా 16వ రోజు కావడం గమనార్హం. హైదరాబాద్‌లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. హైదరాబాద్‌లో సోమవారం లీటరు పెట్రోల్ ధర 34 పైసలు పెరుగుదలతో రూ.82.59కు, డీజిల్ ధర 57 పైసలు పెరుగుదలతో రూ.77.06కు చేరింది.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 33 పైసలు పెరుగుదలతో రూ.82.95కు చేరింది. డీజిల్‌ ధర కూడా 54 పైసలు పెరుగుదలతో రూ.77.41కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 33 పైసలు పెరుగుదలతో రూ.82.56కు చేరింది. డీజిల్ ధర కూడా 55 పైసలు పెరుగుదలతో రూ.77.05కు ఎగసింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 33 పైసలు పెరుగుదలతో రూ.79.56కు చేరింది. డీజిల్ ధర కూడా 58 పైసలు పెరుగుదలతో రూ.78.85కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 32 పైసలు పెరుగుదలతో రూ.86.36కు చేరింది. డీజిల్ ధర కూడా 55 పైసలు పెరుగుదలతో రూ.77.24కు ఎగసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.95 శాతం పెరుగుదలతో 42.34 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.35 శాతం పెరుగుదలతో 39.95 డాలర్లకు ఎగసింది.

ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.




Please Read Disclaimer