వలస కూలీల భాదలు..వైరల్ అవుతోన్న ఫోటో!

0

కష్టం .. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం…ఎంతటి వారైనా కూడా ఎదో ఒక సందర్భంలో కష్టాన్ని చూసేవుంటారు. కానీ ప్రస్తుతం మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న విలయతాండవానికి ప్రపంచం మొత్తం కష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. చైనా లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ వ్యాప్తి చెందుతూ అందరిని ఇంట్లోనే కూర్చోబెట్టింది. ఇప్పుడు చాలాదేశాల్లో లాక్ డౌన్ అమలు అవుతుంది. లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయని దేశాల్లో ఈ మహమ్మారి విజృంభణ భయంకరంగా ఉంది.

ఇక మనదేశంలో కూడా ఈ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజు రోజుకి భాదితుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మహమ్మారి ని కట్టడి చేయడానికి కేంద్రం వూహాత్మకంగా వ్యవహరించి ..దేశంలో వ్యాధి వ్యాపించడం ప్రారంభించిన తోలి రోజుల్లోనే లాక్ డౌన్ ను విధించి వ్యాధిని వేగంగా వ్యాపించకుండా అడ్డుకోగలిగింది. అయితే ఈ లాక్ డౌన్ వల్ల దేశంలో కొన్ని లక్షల మంది వలస కూలీలు చిక్కుకుపోయారు. ఉన్న చోట తిండి లేక ..సొంత ఊర్లకి వెళ్లలేక ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు.

కొంతమంది వలస కూలీలు కాలినడకన సొంత ఊర్లకి వెళ్ళడానికి బయల్దేరారు. వలస కూలీల వ్యధకి అడ్డం పట్టే ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. పనిలేక ..ఆకలితో ఇక్కడే ఉండలేక కాలి నడకన సొంత ఉరికి వెళ్తున్న ఓ వలస కూలి తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతూ ఏడుస్తోన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో ను చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు. కష్టాన్ని ఫొటోలో చూపిస్తే ఇలానే ఉంటుందేమో అంటూ నెటిజన్లు ఈ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home