కేసీఆర్, జగన్ మాకు మిత్రులే.. కేంద్రమంత్రి పరోక్ష వ్యాఖ్యలు

0

ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే అంశంపై చర్చ జరుగుతోంది. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ, మోదీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్.. మోదీకి మిత్రలేనని, వారు ముగ్గురూ ఒకేగూటి పక్షులేనని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ ప్రచారం చేసినా ఇదే అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

కేసీఆర్; జగన్ తమకు మిత్రలేనన్న అర్థం వచ్చేలా గోయల్ హైదరాబాద్‌లో వ్యాఖ్యానించారు. ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కేసీఆర్, జగన్ మీకు మిత్రులే, మీతో కలిసేందుకు వారు సిద్ధంగా ఉన్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించారు దీనికి ఆయన సమాధానమిస్తూ.. ‘కచ్చితంగా.. అదృష్టవశాత్తూ దానిపై ఎలాంటి జీఎస్టీ ఉండదు’ అని వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సొంతంగానే 300 సీట్లు వస్తాయని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. తాను రాజకీయాల కోసం దేవాలయాలను సందర్శించనని రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై గోయల్ మండిపడ్డారు.
Please Read Disclaimer