చైనా టు ముంబై: ప్లేగుకు.. ప్రస్తుత వైరస్‌కు అవినాభావ సంబంధం

0

వ్యాధులు అనేవి హఠాత్తుగా విపత్తుగా వచ్చి పడతాయి. అలా ఎన్నో వ్యాధులు మానవ ప్రపంచాన్ని కబలించాయి. అలా వచ్చిన కొన్ని వ్యాధులు ఇప్పుడు నామరూపాల్లేకుండా పోగా కొన్ని ఉనికి చాటుకుంటున్నాయి. అలా పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి ప్లేగు. ఇది 18వ శతాబ్దంలో తీవ్ర రూపం దాల్చింది. లక్షల సంఖ్యలో ప్రజలు ఆ వ్యాధి బారిన పడి మృతిచెందారు. అయితే ఈ వ్యాధికి ప్రస్తుత వైరస్‌కు కొన్ని పోలికలు ఉన్నాయి. ప్రస్తుత వైరస్ చైనా నుంచే వ్యాపించగా ప్లేగు కూడా అక్కడి నుంచే ప్రపంచానికి పాకింది. మొదట చైనాలో ప్లేగు వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచాన్ని చుట్టేసింది.

ప్లేగు 1890లో చైనా దేశం నుంచే ప్రపంచానికి పాకింది. అప్పట్లో చైనాలో మొదలైన ఈ వ్యాధి ప్రపంచం మొత్తాన్ని కబళించింది. ఈ వ్యాధితో భారతదేశంలో లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి ముంబైలో ఈ వ్యాధి వలన ఎక్కువ మంది మరణించారు. ప్రస్తుత వైరస్ వలన కూడా ప్రధానంగా నష్టపోతున్న నగరం ముంబైనే. ఆ కాలంలోనే ఈ వ్యాధి ప్రపంచమంతా వ్యాపించిందంటే దాని శక్తి ఏంటో తెలుసుకోండి. అప్పట్లో దేశానికి దేశానికి మధ్య రాకపోకలు చాలా తక్కువగా ఉండేవి. ఆ సమయంలోనే ప్లేగు వ్యాధి తీవ్రంగా ప్రబలి లక్షలాది మంది ప్రజలను పొట్టన బెట్టుకుంది.

ప్లేగు వ్యాధి ఎలుకల ద్వారా వ్యాపించింది. 1890లో చైనాలో మొదలైన ప్లేగు వ్యాధి 1894 వరకు హాంకాంగ్‌కు చేరింది. హాంకాంగ్‌లో ప్లేగు తీవ్రరూపం దాల్చింది. అక్కడి నుంచి భారత్‌లోని బొంబాయికి పాకింది. ఓడల ద్వారా వాణిజ్యం జరుగుతుండడంతో 1896లో హాంకాంగ్ నుంచి బొంబాయికి ఒక నౌక వచ్చింది. ఆ నౌకలో ప్లేగు వ్యాధి వాహకాలుగా ఉన్న ఎలుకలు కూడా ఉన్నాయి. ఆ ఎలుకలు బొంబాయి పోర్ట్ నుంచి అప్పటి బొంబాయి నగరంలోకి ప్రవేశించాయి. అవి ప్రవేశించిన కాలం వర్షాకాలం. వర్షాలు భారీగా కురుస్తుండటంతో డ్రైనేజీ వ్యవస్థ పొంగి పొర్లుతుండేది. ఈ సమయంలో ఎలుకల ద్వారా నగరమంతా ప్లేగు వ్యాధి ప్రబలింది. వచ్చిన ఎలుకలు తమ సంతానం పెంచుకుంటూ పోతుండగా ఇలా వ్యాధి పెరుగుతూ పోయింది.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి కూడా ఇదే మాదిరి ఉంది. మొదట విదేశీయుల ద్వారా ఈ వైరస్ మొదలు కాగా… ఇప్పుడు పేదలకు కూడా వ్యాపిస్తున్నది. దీంతో ప్లేగు వ్యాధికి ప్రస్తుత వైరస్‌కు ఈ విధంగా సామీప్యత ఉంది.
Please Read Disclaimer