మోడీ హిందీలో మాట్లాడితే అతడికి ఎలా అర్థమైంది?

0

ప్రధాని మోడీ హిందీ ఎంత బాగా మాట్లాడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. హిందీ భాషే తెలీని వ్యక్తితో కలిసి ఒక భారీ ప్రోగ్రామ్ ను మోడీ ఎలా చేయగలిగారు? తన హిందీ భాషను అసలు హిందీ అక్షరం ముక్క తెలీని వ్యక్తికి అర్థమయ్యేలా ఎలా చేశారు? ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ కోసం ప్రధాని మోడీతో పాటు.. సాహసికుడు బేర్ గ్రిల్స్ కలిసి ఒక ఎపిసోడ్ చేయటం.. ఆ సందర్భంగా మోడీ మాట్లాడిన హిందీని అతడెలా అర్థం చేసుకున్నారన్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ప్రధాని.

హిందీ రాని బేర్ గ్రిల్స్ తో తాను చక్కగా మాట్లాడటానికి.. అతడు తన మాటల్ని అర్థం చేసుకోవటానికి కారణం టెక్నాలజీనేని చెప్పారు. ఇద్దరి మధ్య భాషా పరమైన ఇబ్బందులు లేకుండా ఉండటానికి అధునాత సాంకేతిక పరిజ్ఞానమేనని చెప్పారు. ఆదివారం తాను నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మోడీ.. ఈ ఆసక్తికర అంశాన్ని చెప్పొకొచ్చారు.

మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రత్యేకత ఎపిసోడ్ షూటింగ్ సమయంలో తమ మధ్య సాగిన సంభాషణలో తాను హిందీలో మాట్లాడినప్పటికీ.. బేర్ గ్రిల్స్ చెవిలో ఉన్న కార్డ్ లెస్ పరికరం ట్రాన్స్ లేట్ చేయటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. తాను హిందీలో ఒక మాట మాట్లాడగానే.. బేర్ గ్రిల్స్ కు ఇంగ్లిషులో ట్రాన్స్ లేట్ అయి వినిపించేదని.. దీంతో.. తమ మధ్య సంభాషణ సులువుగా సాగిందన్నారు. టెక్నాలజీ తాలూకు అద్భుత కోణం ఇదేనన్నారు.
Please Read Disclaimer