సెల్ఫ్ క్వారంటైన్.. ఆ దేశంలో అదిరిపోయే ఐడియా

0

కరోనా తీవ్రత ప్రపంచానికి ఇప్పటికే అర్థం కావటమే కాదు.. కంటికి కనిపించని ఈ వైరస్ ను ఎంత తక్కువగా అంచనా వేశామన్న వేదనను పలు దేశాలు ఇప్పటికే వ్యక్తం చేస్తున్నాయి. కరోనా విషయంలో చైనా అనుసరించిన విధానాల్ని పలువురు తప్పు పట్టినా.. ఇప్పుడు దాని విశ్వరూపం స్వయంగా చూసిన తర్వాత మాత్రం చైనా ఎంత ముందుచూపును ప్రదర్శించిందన్న భావనను వ్యక్తం చేయకుండా ఉండలేకపోతున్నారు.

కరోనా వైరస్ యూరోప్ ను చుట్టేయటమే కాదు.. ఇటీవల కాలంలో ఆయా దేశాలకు అస్సలు పరిచయం లేని ఎన్నో దరిద్రాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. దీంతో.. యూరోపియన్ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయటానికి.. ప్రజలు ఎవరికి వారు స్వీయ నియంత్రణతో పాటు.. కరోనా అనుమానం ఉన్న వారు తమను తాము క్వారంటైన్ చేసుకునే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

బ్యాడ్ లక్ ఏమంటే.. బాగా డెవలప్ అయిన దేశాలకు చెందిన ప్రజలు సైతం.. ఇలాంటి వాటి విషయంలో వ్యవహరిస్తున్న నిర్లక్ష్యానికి ఆయా దేశాలు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి. క్వారంటైన్ లాంటి కీలక అంశంలో ప్రజలు ప్రదర్శించే నిర్లక్ష్యానికి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని గుర్తించిన దేశాలు కొన్ని.. కఠిన ఆదేశాల్ని జారీ చేస్తున్నారు. ఇటలీ పరిస్థితిని చూసిన చాలామంది.. కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ముందస్తు చర్యల్ని తీసుకుంటున్నారు.

ఇప్పుడు అలాంటి పనే చేస్తోంది పోలాండ్. ఈ దేశంలోని ప్రజల కోసం హోం క్వారంటైన్ అనే మొబైల్ యాప్ ను రూపొందించారు. దేశ ప్రజలంతా తప్పనిసరిగా దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న విషయాన్ని తెలియజేసేలా ఎప్పటికప్పుడు తమ సెల్పీలతో యాప్ ను అప్డేట్ చేసుకోవాలి. ఇలా సెల్పీలు దిగిన ప్రతిసారీ.. ఆ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్లకు అందుతుంది. వాళ్లు దాన్ని చెక్ చేసి ఓకే చేస్తారు.

ఎవరైనా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకపోతే.. వారి ఇళ్లకు పోలీసులు వస్తారు. ఇంట్లోని వారంతా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారా? లేదా? రూల్ ను పాటిస్తున్నారా? లేదా అన్నది చూస్తారు. ఒకవేళ.. తేడా చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు. ఈ తలనొప్పి అస్సలు వద్దనుకున్నోళ్లు.. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని.. బుద్దిగా తమ ఫోటోల్ని ఈ యాప్ లో పోస్టు చేస్తున్నారు. ఈ విషయంలో షార్ట్ కట్స్ కు అవకాశం లేకుండా చేశారు. ప్రతి ఒక్కరు పోస్టు చేసిన పోస్టుల్ని.. జియో లొకేషన్ తో పాటు.. ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా క్రాస్ చెక్ చేస్తుంటారు.

ప్రతి రోజూ వివిధ సమయాల్లో తమ సెల్ఫీల్ని అప్ లోడ్ చేయాల్సిందే. అలా చేయని పక్షంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందుతుంది. నిర్ణీత గడువు దాటిన తర్వాత సెల్ఫీలు పోస్టు చేయని పక్షంలో.. ఇరవై నిమిషాల్లో పోలీసులు ఇళ్ల ముందుకు వచ్చేస్తారు. నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తారు. ఇలా.. ఈ యాప్ తో కరోనాను కంట్రోల్ చేయటమే కాదు.. హోం క్వారంటైన్ మస్ట్ గా అమలు అయ్యేలా ఆ చిట్టి దేశం ప్రయత్నిస్తోంది. అదిరేలా ఉన్న ఈ ఐడియాను మన దగ్గర కూడా అమల్లోకి తీసుకొస్తే మంచిగా ఉంటుందని అనిపించట్లేదు?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-