ప్రకాశ్ రాజ్ డేరింగ్..మోదీ – హిట్లర్ ఒకటేనట!

0

బహు భాషా నటుడు ప్రకాశ్ రాజ్ ఏం మాట్లాడినా పెను వివాదమే అవుతోంది. కాదు కాదు… వివాదం రేకెత్తేలానే ప్రకాశ్ రాజ్ తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పాలి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు తనదైన శైలిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్… బీజేపీ కేడర్ కు టార్గెట్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఎన్నికల బరిలో నిలిచినా ఓటమి పాలు కావడంతో కొంతకాలం పాటు కామ్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఏమైందో తెలియదు గానీ… మరోమారు మోదీని టార్గెట్ చేసిన ప్రకాశ్ రాజ్ పెను దుమారమే రేపుతున్నారు. మోదీని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది.

ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చేసిన ప్రకాశ్ రాజ్… హిట్లర్ మోదీ ఫొటోలను పేర్చేశారు. సదరు ఫొటోల్లో వివిధ సందర్భాల్లో హిట్లర్ ఎలా వ్యవహరించారో – ఎలా స్పందించారో – ఎలాంటి హావభావాలను పలికించారో… సరిగ్గా మోదీ కూడా అలాగే స్పందించినట్లుగా – అలాగే హావభావాలను పలికినట్లుగా ఫొటోలను వెతికి మరీ అతికించేసి వీడియో రూపొందించేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగానే తెగ వైరల్ గా మారిపోయింది.


హిట్లర్ కు – మోదీకు ఎలాంటి తేడా లేదంటూ ఆ వీడియోలో ప్రకాశ్ రాజ్ చెప్పేశారు. 24 సెకన్ల నిడివి గల ఈ వీడియో హిట్లర్ హావభావాలతో పోలిన మోదీ ఫొటోలను జత చేసిన ప్రకాశ్ రాజ్… నిజంగానే పెను కలకలాన్ని రేపారనే చెప్పాలి. గతంలో మోదీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సమయంలో బీజేపీ నేతలు ప్రకాశ్ రాజ్ పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఈ వీడియోను చూస్తే… కమలనాథులు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న విషయం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోందనే చెప్పాలి. మొత్తంగా కమలనాథులకు మరోమారు ప్రకాశ్ రాజ్ టార్గెట్ గా మారడం ఖాయమేనన్న వాదన అయితే బలంగానే వినిపిస్తోంది.
Please Read Disclaimer